అన్నయ్య అమెరికా నుంచి వచ్చాడు. వచ్చాడు అనే కన్నా వచ్చేశాడు అనడం కరెక్ట్ ఏమో? ఎందుకంటే, అక్కడ ఎమ్మెస్ చేసి నాలుగేళ్లు ఉద్యోగం చేసి వెనక్కి వచ్చేయాలని, ఇక్కడే స్థిరపడాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయి మరీ వచ్చేశాడు. ఇక్కడ ఆఫర్స్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ లోనే ఒక ఎమ్మెన్సీలో జాయన్ అవుదాము అనుకుంటుంన్నాడు. కానీ, అమ్మమ్మ, తాతయ్యలకి ఇంకా నమ్మకం కుదరడం లేదు. “డాలర్ రుచి చూసిన వాడికి రూపాయి రుచించదుగా,” అంటారు వాళ్ళు.Continue reading “14. మలి చూపులు”
Tag Archives: Telugu Short Stories
13. ఫలము, పైకము — ఫలితము
(ఒక చిట్టి కథ) రిటైరైన నేను పెన్షన్ డబ్బులతోను, జబ్బుల టెన్షనుతోనూ బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడు మనశ్శాంతిని వెతుక్కుంటూ గుడికి వెళతాను. ఒక రోజు, ఎప్పుడూ వెళ్ళే గుడికే వెళ్ళాను. గర్భగుడిలో దైవ దర్శనం చేసుకుని, యధాప్రకారం బయట మెట్ల ప్రక్కన ఉన్న గోడ మీద కూర్చున్నాను. లేచి వెళుతూ, సంచిలో ఉన్న వాటిలోంచి కొన్ని పళ్ళు, జేబూలోని చిల్లర పైసలు ఆ గుడి మెట్ల మీద కూర్చున్న పేదవారికి ఇచ్చి వెళ్ళడం మొదలు పెట్టాను. వాళ్ళలో ఒకContinue reading “13. ఫలము, పైకము — ఫలితము”
12. ఎదురు చూపులు
వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వెళ్ళి పదిహేను నిమిషాలు కూర్చున్న తరువాత … యజమాని: ఏమోయ్ ఆగమ రావూ, పని … కాయా? పండా?గుమాస్తా: ఏమో? ఆగమని అన్నారుగదండీ. గదిలో ఏసీ గూడా వేశారుగదండి. ఔనండి. పండనే అనుకోండి.యజమాని: సమయాభావంలో భావం?గుమస్తా: చిత్తం. అది వారి చిత్తం కదండి.యజమాని: మనసులో మసలే మాట మనకి చెప్పేందుకు ఇంత జాప్యమెందుకు?గుమస్తా: మరే … ఆడపిల్లగదండీ … యజమాని: ఐతే, గియితే … కుదిరితే, ఇంకా ఆడ పిల్లా?గుమాస్తా: అవును కదండి.Continue reading “12. ఎదురు చూపులు”
11. శున్కరాజ్
ఔ, ఊరికిబోనికి పొద్దుగాల్నె లేషి ఉరుక్కుంట బస్టాండ్ కాడికి బొయిన. టికెట్ ముందుగాల్నె బుగ్జేష్న గద … పొద్దుగాల్నె పాంచ్ బజేకి ఆడికి బోవల్నంటే యాప్ల ఆటో దొర్కది, క్యాబ్ దొర్కది. టయాన్కి గాడుండకుంటె, గాబస్సాయ్న గరం గరమైతడు, లొల్లి లొల్లి జేస్తడు. గందుకోసం, గాయింత సంచి తీస్కుని మేయిన్ రోడ్ కాడికి ఉర్కి, ఆటో బట్టి బస్టాండ్కి బొయిన. ఇంక యెలుగే రాలె, బస్సు టైమే గాలె. కాని, బస్సొచ్చేసె. నేనెక్కిన. బస్సు దస్మినట్ జల్దొచ్చి,Continue reading “11. శున్కరాజ్”
9. కొలత
“ఎసరు పెట్టేస్తుంది అమ్మ. బియ్యం కొలిచిన గ్లాసు ఎక్కడ పెట్టావు ప్రియ వదినా?” అంటూ బయట నుండి అరుస్తూ అడిగింది మా చిదానందం అన్నయ్య భార్య, అదే, మా పెద్దనాన్న కోడలు. నేను బాల్కనీ వైపు ఉన్న బాత్రూములో ఉన్నాను. ఏదో ఆలోచనలో ఉన్న నాకు, ఒక్కసారి షాక్కొట్టినట్టు అనిపించింది. “ఒక్క నిమిషంలో వస్తున్నా,” అని చెప్పి ఆగమన్నాను. “అలాగే,” అని చెప్పి తను లోపలికి వెళ్ళినట్టు అనిపించింది. గబుక్కున అక్కడే ఉన్న ప్లాస్టిక్ స్టూల్ మీదContinue reading “9. కొలత”
8. వైద్యులు 🩺
“వైద్యో నారాయణో హరి:” అన్నారు పెద్దలు. వారి ఉద్దేశాలు ఏమైనా వైద్య వృత్తికి వన్నె తెచ్చే పరంపరలో లీనమైపోయినవాళ్ళు ఇంకా ఉన్నారనడంలో చాలా ఆనందం కలుగుతుంది కదా! కడుపు నొప్పో, కాలు నొప్పో వస్తే క్షణం పాటు ఆలోచించకుండా ఆసుపత్రికి పరుగులు తీసే వాళ్ళూ ఉన్నారు, వంటింటి చిట్టి చిట్కాలు పాటించి నయం చేసుకునే వాళ్ళూ ఉన్నారు. అలాగే, రోగి దొరికితే చాలు వడ్డించ్చేద్దామనే వైద్య శిఖామణులు ఉన్నారు, చికిత్స అవసరం లేకపోతే పైసా ఫీజు తీసుకోకుండాContinue reading “8. వైద్యులు 🩺”
7. అసలే కోతి …
అసలే కోతి. అది కల్లు త్రాగినది. దానికి ముల్లు గుచ్చుకున్నది. అది సరిపోదనునట్టు నిప్పులు త్రొక్కినదట. ఇంక చెప్పుటకు ఏముండును. అంతా విదితమే గద! ఇటువంటి పరిస్థితులు మనవంటి మానవులకు వచ్చిన యెడల, వాటినేమందురు? సినిమా కష్టములు అందురు. అది అటుయుంచిన, ఈ రకమైన గంపెడు కష్టములు ఎవరికి వచ్చును? ఇది అతిశయోక్తి మాత్రమే సుమా అని వాదించు వారు కూడ మెండుగ నుందురు. ఒకపరి చిదానందమునకు రొంప చేసినది. ముక్కునుండి రెండు జీవ నదులూ పారుచుండెను.Continue reading “7. అసలే కోతి …”
6. బరువు — బాధ్యత
చిదానందం బావ ఇచ్చిన ఆ కవరు తీసుకుని అక్క మా ఇంటికి వచ్చింది. దాని గోల భరించలేక అది పుచ్చుకుని బ్యాంకుకి వెళ్ళి తిరుగు టపాలో తిరిగొచ్చాను. నా కోసం ఇంటి దగ్గర అమ్మ, అక్క ఎదురు చూస్తున్నారు. లోపలికి అడుగు పెట్టగానే ‘పని అయిందా’ అన్నట్టు నా కళ్ళల్లోకి చూసింది అక్క. దాని బాధ చూడలేక పోయినా, నిజం కూడా దాచ లేనుగా. ఏమి మాట్లాడాలో తోచక ఆ కవరు మళ్ళీ దాని చేతికి ఇచ్చేశాను.Continue reading “6. బరువు — బాధ్యత”
5. ఆర్యవర్ధన్
“Oh, I see a different interpretation to this Shakespearean text” అన్నారు మా గురువుగారు ఒకింత ఆవేశంగా. అది పాతికేళ్ళ క్రితం. ఆయన ముఖంలోని ఆ ఆశ్చర్యం నేను ఇప్పటికీ మరచిపోలేను. అప్పుడు ఆయన మాకు ‘హామ్లెట్’ చెబుతున్నారు. ఆ ఏడాదిలో ఆయన రిటైర్ అవుతున్నారు. మరి ముప్ఫైమూడేళ్ళు పాఠం చెప్పారు కదా, ఇప్పుడు అదే టెక్స్‌ట్‌లో కొత్తదనమేమిటా అనిపించింది. తలచుకుంటే ఇప్పటికీ ఆ ఆశ్చర్యం అలాగే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే, షేక్స్పియర్ నాటకాలుContinue reading “5. ఆర్యవర్ధన్”
4. సమర్ధన — విచక్షణ
చిదానందం అనుకున్నట్లు ఆ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయింది. అందరం ఇంటికి వచ్చేశాము. కాళ్ళ నొప్పులతో కూర్చున్న నాకు వాడు కాస్త కొబ్బరి నూనె రాసి మర్దనా చేశాడు. నిజానికి అలసి పోయింది వాడే. అన్ని వసతులు చేస్తే ఊరికే వెళ్ళి వచ్చే సరికే ఇంత అలసట. వయసు కదా మరి. వాళ్ళ తాతయ్య కోరిక ప్రకారం వాడి షో అయింది. ఆయన తన మనవడికి వచ్చిన పేరు తనకే వచ్చినట్లు ఎంత పొంగి పోయారో. వాణ్ణిContinue reading “4. సమర్ధన — విచక్షణ”
2. మహాభారతంలో మంచూరియా
చిదానందం తన భార్య, ఇద్దరు కొడుకులతో ఇండియాలో ఉన్న తన తల్లితండ్రులను చూడాలని అమెరికా నుండి వచ్చాడు. ఓ మూడు నాలుగు వారాలైనా ఉంటాడేమో! అతనికి తన తల్లితండ్రులంటే చాలా ఇష్టం. ఫ్లైట్లో పిల్లల గోల ఎలా ఉన్నా, వచ్చినప్పుడల్లా తన బాల్యాన్ని, ఇంట్లో అందరూ కలసి గడిపిన రోజులని వీలైనన్నిసార్లు గుర్తు చేసుకుని తనలోతానే నవ్వుకుంటూ ఏవో హావభావాలు వ్యక్తపరుస్తూ ఉంటాడు. తనకి అది తెలియని ఆనందం. ఎదుటివాళ్లకి మాత్రం అర్థం కాని వెర్రితనం. ఏదిContinue reading “2. మహాభారతంలో మంచూరియా”
1. ఆవ ఘాటు
చిదానందం: ఏమోయ్, ఆవపెట్టి పులిహోర కలుపుతున్నావా? … నిన్న, కందిపప్పు వేయించి వండిన ముద్ద పప్పు, కొబ్బరి తురిమి పెట్టిన మజ్జిగ పులుసు సూపరనుకో! భార్య: ఔనా? మరి పప్పులోకి కొత్తావకాయ, అందులోకి మీగడ గిలక్కొట్టి తీసిన ఫ్రెష్ వెన్న కాంబినేషనో? చిదానందం: అది ఇంకా సూపరు! అందుకేగా ఒక ముద్ద ఎక్కువ లాగించింది. అయినా నీ చేత్తో పెట్టిన ఆవకాయ ఏడాది పొడుగూ కొత్తావకాయలాగే ఉంటుందంటే నమ్ము. అందులోకి నువ్వు వేసే మీగడైతేనేమి, అది గిలక్కొట్టనContinue reading “1. ఆవ ఘాటు”