శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కం.
కోరిన వారల, మరి నను
కోరెడి వారల సుఖమును కోరెద మిన్నుల్
మీరగ; పేరుతో పనియేమి?
పరికింప, క్రోధీ, యుగాది పండుగే ముఖ్యం!

                                 -టిఎస్ఎస్ మూర్తి

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

(EP) 16. Is a Soldier a Monk?

Who is a soldier? Can anyone guess?
He is a common man like any one of us;
He has parents, siblings and a family,
Who wait for his calls and messages, fondly!

Yet, all his endeavours are for all,
Known or unknown, ready on call;
Marches forward with a single point agenda,
To protect us by standing in the country’s veranda!

Who is a monk? Can anyone guess?
He is an uncommon man unlike us;
He has left his parents, siblings and family,
Who don’t wait for his calls or messages, simply!

And, all his endeavours are mooted spiritually,
Unknown and unintelligible to us, even virtually;
Marches forward with a single point agenda,
To protect us by standing behind the country’s veranda!

But, when a soldier gets into his attire,
All his relationships will invariably retire;
Then, can we call a soldier a monk?
Yes. Why not? Call a soldier, also a monk?

Note: This poem was published in Sanchika Magazine on 1st February 2024. Please see the link below.

https://sanchika.com/is-a-soldier-a-monk-tssm-poem/

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

13. ఫలము, పైకము — ఫలితము

(ఒక చిట్టి కథ)

రిటైరైన నేను పెన్షన్ డబ్బులతోను, జబ్బుల టెన్షనుతోనూ బ్రతుకుతున్నాను. అప్పుడప్పుడు మనశ్శాంతిని వెతుక్కుంటూ గుడికి వెళతాను.

ఒక రోజు, ఎప్పుడూ వెళ్ళే గుడికే వెళ్ళాను. గర్భగుడిలో దైవ దర్శనం చేసుకుని, యధాప్రకారం బయట మెట్ల ప్రక్కన ఉన్న గోడ మీద కూర్చున్నాను. లేచి వెళుతూ, సంచిలో ఉన్న వాటిలోంచి కొన్ని పళ్ళు, జేబూలోని చిల్లర పైసలు ఆ గుడి మెట్ల మీద కూర్చున్న పేదవారికి ఇచ్చి వెళ్ళడం మొదలు పెట్టాను.

వాళ్ళలో ఒక గ్రుడ్డివాడు కూడ ఉన్నాడు. అప్పటికి నా చేతిలో చిల్లర అయిపోయి ఒక్క బత్తాయి పండు మాత్రమే మిగిలింది. బేబులో చెయ్యి పెడితే ఒక పది రూపాయల నోటు బయటకి వచ్చింది. రెండూ అతని చేతిలో పెట్టి, మిగతా మెట్లు దిగి చెప్పులు తొడుక్కుని బయలుదేరాను.

ఇంతలో మా పక్కింటి వాళ్ళ మనవరాలు స్కుటీ మీద వచ్చి, “తాతగారు, నేను కూడ గుళ్ళోకి వెళ్ళి వస్తాను, మీరు ఆ ఎదురుగా ఉన్న పూల కొట్టు దగ్గర కూర్చోండి. ఇద్దరం కలిసి నా బండీ మీద వెళదాము,” అంది. సరే అని అలా కూర్చున్నాను.

కొద్ది సేపటికి ఆ అమ్మాయి తిరిగి వచ్చింది. ఇద్దరం రోడ్డు దాటుతూ ఉండగా నా ద్రుష్టి ఆ గ్రుడ్డివాడిపై పడింది. ఒక్కసారి ఆగి గమనించాను. అతని కాళ్ళ దగ్గర బత్తాయి పండు తొక్కలన్నీ పడి ఉన్నాయి. కానీ, చూస్తూ ఉండగానే, ఆ గుడ్డి వృద్ధుడు తన జేబూలోంచి ఒక్కొక్క నోటూ తీసి, వాటిని బాగా తడుముతూ తన ప్రక్కనే కూర్చున్న ఒక మధ్య వయస్కుడికి ఇచ్చాడు. ఇద్దరూ లెక్క చూసుకున్నారు. అవన్నీ కట్టగట్టి ఆ రెండో అతను తన జేబూలో పెట్టుకున్నాడు. తరువాత చిల్లర పైసలు కూడ ఒక మూట కట్టి తీసుకున్నాడు. ఆ రెండో అతనికి అన్ని అవయవాలూ బాగానే ఉన్నాయి. అప్పుడు సమయము సుమారు పదకొండున్నర. గుడి కట్టేసే సమయం. అతను ఆ గ్రుడ్డి వాడిని మా ముందరే ఇంకొక స్కూటీ మీద ఎక్కించుకుని వెళ్ళి పోయాడు.

అంటే, పండు మాత్రమే అతను తినగలడు. ఆ అవకాశం వదులుకోకుండా తినేశాడు. డబ్బులన్నీ ఇచ్చేయవలసిందే. కాదా? లేకపోతే ఎందుకు ఇచ్చేశాడు? మరి వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ గ్రుడ్డివాడికి కమిషన్ ఏమైనా వస్తుందా? … ఏమో? … ఒక్కసారిగా ఇన్ని ప్రశ్నలతో బుర్ర వేడెక్కిన నాకు చిన్నప్పుడు మా మాష్టారు గారు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చింది, “మంచి చేయడం ధర్మం, కానీ సూక్ష్మం తెలుసుకుని చేయడం అవసరం” అని.

Note: This story was published in the magazine “Sanchika” On 28th January 2024. Please see the link below.

https://sanchika.com/phalamu-paikamu-phalitamu-tssm-story/

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos … given below:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

(EP) 15. Rāmō Vigrahavān Dharmaha

“On 22nd January 2024 … in Vamsy

The planning started the day the date was announced,
While the response was not that pronounced;
Certain things appear to have no head or tail,
As, it needs leadership to fight tooth and nail!

Once the programme was clear and straight,
The cultural committee began with its trait,
Bringing the Ram Mandir … drawn in our courtyard,
With more hands putting the best foot forward!

The Sundarakānd rendition resonated,
The glowing Diyās🪔🪔 mesmerised,
The procession of Rām Lāla peaked the celebrations,
The hoisting of the Lord’s flag exceeded all calibrations!

Though the wait was too long,
All believers echoed “we belong”;
The entire country celebrated the consecration,
So is Vamsy that came together with dedication!

Unless we have the mahāyōga,
Can we watch this in kaliyuga,
About Rāma from Tretāyuga,
Making it our births’ mahābhōga?

Does anyone recall his/her ancestors’ names?
His story is recalled even with different hymns;
Crossing the Yugās, the subtle carriers of time,
Here in lives Lord Rāma whose name itself is a chime!

So, uttering His name itself if sufficient,
To make one’s life so magnificent;
No generation can forget His Vigraha,
Because, Rāmō Vigrahavān Dharmaha! 🙏🙏🙏

Jai Sriram

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

(EP) 14. The Smartphone Sāgā …!

The wall clock went waning,
While we were willingly lost in its taming;
The alarm in the time piece stopped buzzing,
While we were willingly lost in its snoozing!

The photographic memory went down tumbling,
While we were willingly lost in its storage juggling;
It royally outmoded the fun and frolic of recalling,
While we were willingly lost in its jackalling!

FM radio, his and her entertainment, went missing,
While we were willingly lost in its cunning kissing;
The calculator, for big multiplications, went thrashing,
While we were willingly lost in its subtle cashing.

With the lens it produced, the camera went crushing,
With the new music file formats, the tape, CD ... all went smashing;
Down the memory lane went the diary disappearing,
While we were willingly lost in its tapering and tampering.

With its invention, the land-line started stopping ringing,
It even started stopping the Indian 'Mangala Harati' rendering;
It suggests by listening to us - open privacy laundering,
While we were willingly lost in its all-invasive plundering.

It engulfed the calender, books, letters, note-taking,
Photos, videos, telegrams, groceries, banking,
Newspaper, magazine, movies and all documenting,
While we were willingly lost in its eternal capture-all hunting!

It swallowed tickets, templates, wishes, temples, worshipping,
Remote, switches, messaging, gaming, typing,
Classes, texts, notes, handwriting, and all learning,
While we were willingly lost in its smart churning!

Still, let's realise, it cares an iota,
Irrespective of Sony, Mahogany, Parata or Toyota;
It penetrates anywhere; and with AI in, be ready,
It has already scripted even your dupe's parody!

Every innovation brings with it merits and demerits,
Our choice to use or misuse will operate our spirits;
A machine is a machine that can't replace any relationship,
So is a SMARTPHONE that can't replace any kinship!

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

12. ఎదురు చూపులు

వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు వెళ్ళి పదిహేను నిమిషాలు కూర్చున్న తరువాత …

యజమాని: ఏమోయ్ ఆగమ రావూ, పని … కాయా? పండా?
గుమాస్తా: ఏమో? ఆగమని అన్నారుగదండీ. గదిలో ఏసీ గూడా వేశారుగదండి. ఔనండి. పండనే అనుకోండి.
యజమాని: సమయాభావంలో భావం?
గుమస్తా: చిత్తం. అది వారి చిత్తం కదండి.
యజమాని: మనసులో మసలే మాట మనకి చెప్పేందుకు ఇంత జాప్యమెందుకు?
గుమస్తా: మరే … ఆడపిల్లగదండీ …
యజమాని: ఐతే, గియితే … కుదిరితే, ఇంకా ఆడ పిల్లా?
గుమాస్తా: అవును కదండి.

ఐదు నిమిషాల తరువాత …

వాళ్ళింట్లో ఎంచక్కా, చక్కటి కీర్తనలు వినిపిస్తున్నాయి. ఇంతలో “… సీతమ్మ చెప్పవమ్మా …” అంటూ మంగళంపల్లి వారు ఆలపించిన రామదాసు కీర్తన వినిపించింది.

యజమాని: వింటున్నావా ఆగమా?
గుమస్తా: అయ్యా, ఇంక హమ్మయ్యా అనుకోండయ్యా! తమరి మనసులో మాట రామయ్య పెడచెవిన పెట్టకుండా సీతమ్మ చెవిన వేసినట్టుందయ్య.
యజమాని: మరి … స్థాయి …?
గుమస్తా: ఆయనకేమండి? గాత్రం హెచ్చు స్థాయే గదండి?
యజమాని: ఆగమా, భాషతో ఇంత ఆగమా? నేను అనేది వాళ్ళ స్థాయి, మన స్థాయి.

ఆ కీర్తన అయిపోయి, “తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు …” అనే కీర్తన మొదలయింది.

యజమాని: ఆగమా, ఏమిటి ఈ హంగామా? చూడబోతే, మన మాటలకి తగ్గట్టు కీర్తనలేంటోయ్? యాదృచ్ఛికమా లేక అలెగ్జా లాంటి యాంత్రిక ప్రభావమా?
గుమస్తా: అయ్యో! ఎంత మాటండయ్యా? యంత్రాలకి తెలుగు అప్పుడే అబ్బిదంటారా? అబ్బే … “అబ్బో” అనేందుకు ఇంకా ఎన్ని తరాలో! ఇది భగవదేచ్ఛ అనే నా మనసులో గంట కొడుతోంది. మనం వచ్చి అరగంట అయింది. అదిగో గడియారం కూడ గంట కొట్టింది. ఇవే మంగళ వాయిద్యాలు అనుకుందాము.
యజమాని: అంతేనంటావా, ఆగమా?

మరో మూడు నిమిషాల తరువాత …

ఇంతలో, “ఏమి సేతురా లింగా …” అంటూ మంగళంపల్లి వారి గాత్రం వినిపించింది.

గుమస్తా: అలా చూడకండయ్యా? అది కూడ మీ మనసులో భావమేగా?
యజమాని: సరేగానీ, ఈ యుగంలో కూడ ఎంతసేపు ఈ పడిగాపులు?
గుమస్తా: ఇది ఒక్క చోటే కదండి ఇచ్చుకునే వాళ్ళు పుచ్చుకునే వాళ్ళ దగ్గర చూపులు, తరువాత ఎదురు చూపులు!
యజమాని: నిజం సుమ్మీ. కనేటప్పుడు ఎరుగము. కన్నకొద్దీ కనిపిస్తోంది కన్న ప్రేమ. ఎంతసేపు అయినా పరవా లేదు. వారు పండంటే పండగేగా!

ఇంకో మూడు నిమిషాల తరువాత …

అప్పుడు వినిపించింది, “తెర తీయరా తిరుపతి దేవర …” అని, మరోసారి మంగళంపల్లి వారి గాత్రంలోనే.

తెర ప్రక్కకు తీసి, అబ్బాయి తలిదండ్రులు బయటకు వచ్చి, వారి అబ్బాయికి వీరి అమ్మాయి నచ్చిందని చెప్పారు. తెరలు తొలగి, ఆ చల్లని గదిలో ఈ తీయని కబురు వీనుల విందు చేసింది.

అరగంట తరువాత, వారు యజమాని ఇల్లు చేరాక …

గుమస్తా: అయ్యా, కతికితే అతకదని అక్కడ వద్దన్నారు. ఇప్పుడన్నా నోరు తీపి చేసుకుని … ఆ పైన నాకు సెలవిస్తే …
యజమాని: ఎన్ని రోజులు?
గుమస్తా: చిత్తం, రెండు.
యజమాని: బ్రహ్మ గారిని వెంట బెట్టుకురా. ‘మీదు కట్టి, పెళ్ళి పనులు మొదలు పెట్టాలి’ … అంటున్నారు అమ్మ గారు … ఊ, ఆగమ రావూ, మళ్ళీ ఎప్పుడు వస్తావు?
గుమస్తా: చిత్తం. తమరు పనులు పురమాయించక మునుపే.

****** స్వస్తి ******

Note: ఈ కథ “సంచిక” పత్రికలో 1/11/2023 నాడు ప్రచురితమైనది.

https://sanchika.com/eduru-choopulu-tssm-story/

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

11. శున్కరాజ్

ఔ, ఊరికిబోనికి పొద్దుగాల్నె లేషి ఉరుక్కుంట బస్టాండ్ కాడికి బొయిన. టికెట్ ముందుగాల్నె బుగ్జేష్న గద … పొద్దుగాల్నె పాంచ్ బజేకి ఆడికి బోవల్నంటే యాప్ల ఆటో దొర్కది, క్యాబ్ దొర్కది. టయాన్కి గాడుండకుంటె, గాబస్సాయ్న గరం గరమైతడు, లొల్లి లొల్లి జేస్తడు. గందుకోసం, గాయింత సంచి తీస్కుని మేయిన్ రోడ్ కాడికి ఉర్కి, ఆటో బట్టి బస్టాండ్కి బొయిన.

ఇంక యెలుగే రాలె, బస్సు టైమే గాలె. కాని, బస్సొచ్చేసె. నేనెక్కిన. బస్సు దస్మినట్ జల్దొచ్చి, జల్దెల్లిపోయె. మనం టయాంకి రాకుంటె, గాబస్సైన గుస్స గుస్సైతడు. మల్ల ఆల్లు లేటొస్తె, మనం సమజ్జేస్కొవాల. గిదేం నాయమో, ఏం కతో! ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

నాది సబ్సె ముంగట సీటు అన్నట్టు. ముంగట గ్లాస్లకెల్లి రోడ్డు మస్త్ గానొస్తుంది. నయా ఎలకట్రిక్ బస్సుగద, యేసవి కాలంల ఏసి కతర్నాకుంది. పొద్దుగాల్నె లేషినగద, గా ఏసీల మంచి నీందొచ్చెటట్టుంది. గింతల బస్సు డైవరు, పక్కన గూసున్న గా అసిస్టెంట్ లెక్కున్న పిలగాని మీద అరవబట్టె. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

కావల్స్కోని ముంగట సీట్ల గూసుంటి. అరె … ఇగ నీందేమొస్తది? వద్దన్నా ఇనబడతాంది. ఎన్కకి బోదమంటె ఎవల్దేంమ్ సీటొ ఎవన్కెర్కె? మల్లి గా పిలగాన్నె అడగాలె. గంద్కె గమ్మున గూసున్న. కాని, గాల్ల పంచాయతి అంత ఇనబడతాంది, నా నీంద్ కరాబ్ జేస్తాంది. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

అసల్కి ఏమైందంటే … నేనెక్కిన స్టాప్ కంటె ముందు స్టాప్ల ఎవల్నో ఎక్కాల్స్కొనుండె. గాడ బస్సాగలె. గాడ ఇష్టాప్ లేదంటడు డైవరు. లేకుంటే ఆడెక్కమని టికెటెట్ల గొట్టింరంటరు గా యెక్కాల్సినోల్లు. జర జర సమజైతా ఉంటె జర జర నా నీంద్ కరాబైతాంది. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

ఆల్లేమొ ఎన్కపంటి బస్సెక్కనికి గాడీ మీద ఒస్తుంన్రని ఎర్కైంది. గప్పుడా డైవర్ ఆల్లని ఇంకేడికో రాన్రి, గిక్కడెక్కడ బస్సాపనికి గాదని అర్షిండు. బస్సట్లనే పోయ్ పోయ్ పోయ్ ఆగె. మల్ల … ఆగి పంద్ర మినిటాయె. ఆడెక్కెటోల్ల కోసమా, గా ఎన్క ఉరుక్కుంటొచ్చెటోల్ల కోసమా ఎవన్కెర్కె? డైవర్ బస్సుల, గా అసిస్టెంట్ పిలగాడు కింద ఫుట్ పాత్ మీద గూసుని ఆల్ల మొబైలల్ల ఏందో ఏందో ఒర్లుతనే ఉన్నరు. ఏందో గీ పంచాయతీ? నడిమిట్ల డైవరు గా అసిస్టెంట్ కోసం చూచుడు, అర్చుడు. ఫుట్ పాత్ మీద గూసుని ఫోన్ల బడ బడ బడ మాట్లాడ్తాన్న గా పిలగాన్కి ఇనిపియ్యది. మల్ల మా పరిస్తితేంది? ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గింతల ఓ పిల్లగాడు, ఓ పిల్ల స్కూటర్ మీద ఒచ్చిన్రు. ఎన్క, గా స్టాప్ల బస్సాగకుంటె ఉరుక్కుంట ఒచ్చినోల్లు ఈల్లె. ఆల్ల బాగ్లన్ని బస్సు కింద గుహలెక్క ఉంటదిగద, ఆడ బెట్టి, బస్సెక్కిన్రు. గా పిలగాడు ముందుగాల దబదబ దూరిండు. ఎన్కకురికిండు. ఎన్కాల్నె గా పిల్ల గూడ ఎక్కినది. ఐతే గామె చేత్ల ఒక కుక్కపిల్ల గూడుంది. గిదేంది? గిదేమన్న మున్స్పాల్టోల్ల కుక్కల బండా? గదిబి ఏసీ బండి. అందరిగ ఎన్కకి దిరిగి గా పిల్లని, గా కుక్కని, గా పిల్లని, గా కుక్కని, సూస్తాన్రు. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గీ నడిమిట్ల బస్సు స్టాటాయె. గప్పుడా పిలగాడు ముంద్కురుకొచ్చి, గా పిల్లకి బాయ్ జెప్పుకుంట దబదబ బస్సు దిగెల్లిపోయిండు. గప్పుడు సమజైంది బస్సుల బొయ్యేడిది గా పిల్ల యింక గా కుక్కపిల్ల మాత్రమే అని. ఐతే, మల్ల అందరు గా పిల్లని, గా కుక్కని, సూసుడు షురు జేషిన్రు. బస్సులేంది, కుక్కలేంది? అందర్ ఆల్ల పక్కనోల్లతోని ఆల్ల, ఆల్ల పంచాయతీల్ షురు జేషిన్రు. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గిదిట్లుంటే, గా బస్ల అసిస్టెంటు జెల్ది ఎన్కకుర్కిండు. గా పిల్ల పక్కన గూసున్నోలెవలో ఏదో అంటాన్రు. గీ పిలగాడు ఇంటాండు. పష్టుసీట్ల గూసున్నగద, నాకేమిన్పిస్త లేదు. కాని, ఏదొ లొల్లి మాత్రమైతాంది. బస్సైతె పోతాంది. ఏసి మంచిగనె ఉంది. డైవరు జోర్ పెంచిండు. అందరేమొ పక్కకి మాట్లాడుడు, గా కుక్కకేసి సూసుడు. గా అసిస్టెంట్ పిలగాడు ఆన్నే ఉండు. గింత జర్గుతాంటే ఇగ నీందే మొస్తది? ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గింతల, గా పిల్ల పక్కన గూసున్నాయన ముందుకురుకొచ్చిండు. డైవరు కాడికి బోయి పంచాయతీ షురూ జేషిండు. పక్క సీట్ల గా పిల్లతాన కుక్కున్నది … పిల్ల గూసోనికి ఓకే, కుక్క గాదంటాండు. మల్ల డైవరు బస్సు నడపాల్నా, గీ లొల్లి ఇనాల్నా? బస్సైతె జోర్గ బోనిస్తుండు. నడిమిట్ల గీనెకేసి జూసుడు. గిదేం కత? గాయింత అటిటు దిప్పేస్తే? గట్లని గీ లొల్లి కోసంకి బస్సాపబడ్తె? … ఏందో, యేమో? ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గా బస్సు డైవరు ఏందో జెప్పబోయిండు. గీ పాసింజరు ఇనడాయె. గప్పుడు, గా పిల్ల కుక్కతోని ముందుకొచ్చె. “అంకుల్, గిది చిన్న కుక్కపిల్ల. ఏంజెయ్యది,” అన్కుంట జెప్పనికి ట్రై జేషె. గా పెద్దమనిషి ఇనకపాయె. “బస్సుల కుక్కలేంది?” అని అరుస్తాండు. గిప్పుడా అసిస్టెంట్ గూడొచ్చిండు. గా పిల్ల జెప్పుడు, గీ పెద్ద మనిషి ఇనకబోవుడు. ముంగటసీట్ల గూసున్న గద, గీ లొల్లంత మస్తుగినొస్తుంది. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గా పెద్ద మనుషిది గూడ తప్పేముంది? కుక్కని జూషి భై పడతాండు. మల్ల బొడ్డు సుట్టూ ఇంజెక్షంన్లు తీస్కొనుడు ఎవల్కిష్టం జెప్పున్రి? మల్ల, గా పిల్ల జెప్పుడు గూడ ఓకే అనిపిస్తాంది. గీ పెద్ద మనిషి భయమ్ గూడ కరెక్టే అనిపిస్తాంది. గింతల, ఓ కుర్రోడొచ్చి, కుక్కలంటె తనకిష్టమని, గా పెద్ద మనుషి సీట్ల తను గూసుంట, తన సీట్ గా పెద్ద మనుషికిస్తనండు. గంద్కు గా పెద్దమనుషి ఓకే జెప్పి, బోయి గా పిల్లగాని సీట్ల గూసుండు. “పిల్ల పక్కన గద … అంద్కె గా పిల్లగాడు రెడీ అయ్యిండు,” అన్కుంటాన్రు కొందరు. లొల్లి ఖతమైందని సంతొషించాల్నా, ఇంకొక లొల్లి షురూ అయిందని తల బట్కోవల్నా? ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గప్పుడు, మస్తు నిద్ర బోయినా. టయాము ఎనిమిదైతాంది. బస్సాగె. ఎలకట్రిక్ బస్సు గద, ఛార్జింకోసం. గా అసిస్టెంట్ లేచి, పంద్ర బీస్ మినిట్ బస్సాగుతది, నాష్తజేసి రమ్మనె. గాడనె హోటల్ బీ ఉన్నది. నేన్ టిపిన్ జేషి, టీ తాగుతా బస్సు పక్కన నిలబడ్న. గా పిల్లనేమొ టిపిన్ జేషొచ్చె దాక గా పిల్లగాడు కుక్కని జూషె. పాపం … మంచి పిలగాడె. సాయంజేస్తాండు గద. కుక్కలంటె ఇష్టమున్నోల్లని జూష్నగాని, వాట్కి గన్నేసి ముద్దులు పెట్టుడు జూషింది గిప్పుడె. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

గా పిల్ల కుక్కని దీస్కున్నక గా పోరోడు నాష్తకు బోయిండు. గప్పుడొక ఏడాది పిలగాన్నెత్తుకుని ఒకామె బస్సుదిగింది. అన్నం బెడతాంటె తింటలేడు. పిలగాన్కి కుక్కని జూపిస్తె నవ్విండు. అన్నందినుడు షురూ జేషిఉండు. గిదేందనుకుంటాన్రా … గదంతే. సమజ్జేస్కోవాల. కుక్కని జూపిస్తానే అన్నం బెడితే మొత్తం దినేషిండు. గదేగద మల్ల! ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

కుక్కని కింద ఇడిస్తే, గది ఆడ ఈడ ఉర్కింది. గా పిల్లగూడ దానెన్కనే ఉర్కింది. ఆడున్నోల్లు గూడ దాన్తోని ఉర్కి ఆడిన్రు. నిజం జెప్పల్నంటె మస్తు మంచిగనిపించింది. నేనెందుకు కుక్కని బెంచనికి సోంచాయించలేదా అనుకుంట, ఆల్లందర్ని సూషి నేనుగూడ గట్లనే కుక్కతోని ఆడితెట్లుంటదా అనుకుంటాన్నా, గింతలో డైవరు హారన్ గొట్టిండు. అంతే … బస్సెక్కాలగద! ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

నేను నెక్స్ట్ స్టాప్ల దిగాల. దిగనికి గా పిల్ల కుక్కనెత్కుని ముందుకొచ్చి కూసుంది. ఆమె పక్కన ఓ పెద్ద ఆడ మనిసి గూసుంది. మెల్లంగ కుక్కతోనాడుడు షురూ జేషింది. గా కుక్కకేమొ మొకం నిండ బొచ్చుంది, ఒంటి మీద యెంటిక గూడ లేదు. “గిదేంది?” అడిగింది పెద్దామె.
“సమ్మర్ గద,” అంది గా పిల్ల.
“గదేంది?” అడిగింది పెద్దామె.
“సమ్మర్ల చెమ్టలెక్కువుంటయ్ గద, గందుకె పార్లర్కి తీస్కబోయి గోర్లు క్లిప్ జేయించి, హేయిర్ కంప్లీట్గ ట్రిమ్ జేయించిన ఆంటీ నిన్ననే,” అంది గా పిల్ల.
గంతె. గా పెద్దామె నోరెండబెట్టి మూసేషింది. ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి.

ఇగ గా పిల్ల గా పార్లల కుక్కలకి ఏమేం జేస్తరో గవన్ని జెప్ప బట్టె. ఒకొక్కటి ఇంటాంటె గా పెద్దమె మొగం అట్టెట్టనో అయిపాయె. మెల్లగ సంబాలించుకొని గా పెద్దామె దిగుదమనుకుంటాంది. ఎవరికో ఫోన్ జయ్యనికి సెల్ ఫోన్ దీషె. గప్పుడా పిల్ల కుక్కపిల్లని ఆమె ఒళ్ళబెట్టి, “మా కుక్కతోని సెల్ఫీనా? ఓకే, ఆంటీ” అన్నది. గా పెద్దామె మొకానికి గింత నవ్వు బూస్కొని సెల్ఫీ గొట్టుకొంటుంటె, గా పిల్ల బస్టాపొచ్చె. గిక్కడ, సెల్ఫీకి కుక్కని సరింగ జూడమని జెప్తాంది. గక్కడ, డైవర్ను బస్సాపమంటాంది. గా పెద్దామె సెల్ఫీ దీస్తాంది, గీ డైవర్ ‘ఇగ సాల్తీ. ఎన్ని సార్లు నీ కోసం బస్సాపాలె?’ అన్నట్టు సూస్తాండు.

గిదేంది? కుక్కకు హాయ్ జెప్తె, సంకెక్కి సెల్ఫీ దగ్తదా? వామ్మో! ఏంజేస్తం, ఇగ సమజ్జేస్కోన్రి!

(P.S. If you like this, A. G. Gardiner’s “All about a Dog” is an interesting writeup to read.)

Note: ఈ కథ “సంచిక” పత్రికలో 1/10/2023 నాడు ప్రచురితమైనది. https://sanchika.com/shunkaraj-tssm-story/

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi

Vamsy Ganesh Utsav — 2023

Day One

Prologue

Ganesh Chaturdhi
Began with Maha Aarti
Different families with aarti thalis
Gathered to offer fulfilling prayers.

Prisha — Maha Aarthi should be with “STEPS”
Kiran — The theme of Chandrayaan … never stops;
Mrs. Mayur — “I designed my husband’s name like a peacock”
Eventually, it stood the winner; rock, rock, rock.

Other Activities

The yearly quiz was all around the screens
Tinu did the screening n pruning: three cheers;
Not announcing the scores till the end
Made the teams to try and not pretend.

The organisers chained the participants hands-free
Out of coverage area, no Google or Siri,
Human mind did something outdated and strange
Within and without the 5G and Wi-Fi range!

Day Two

Ashirwad” — calling the families on to the stage
Showcasing the culture craft to our advantage
A novel idea … will Vamsians shower praise or shun?
Jor ka success dheere se — by Mr and Mrs Roshan.

Erupting emotions, joyous commotions
Unintented recollections, intended felicitations
Much imputed to our parents for what we are
For they beget, build and eternally bless with pyaar.

A son felt to be a king in his Dad’s kingdom
Another said that parents are his stardom
A son in son-in-law, a father in father-in-law
A daugher in daughter-in-law, a mother in mother-in-law.

As planned, the theme was South Indian
Delicious n delectable, food was South Indian
Gorgeous and handsome, Dress code was South Indian
Following the code, each one remained a true Vamsian!

Day Three

Dandiya

With Maa Shakti in the center, the music played dhol baaje dhol
As participants danced around her, the music played dhol baaje dhol
For Garba and Dandiya Raas steps, the music played dhol baaje dhol
With clappings and Dandiya sticks booming, the music played dhol baaje dhol.

With flood lights and no fans, the evening though sultry
The ambience created attracted all and sundry
Men and women, young and old danced to the tunes
Dancing their way in opposing circles, enjoying the twists and turns.

The dress code was neither simple nor magical
Carrying it and careering it with control was equally logical;
The little space in the courtyard was spacious for dandiya
As all eyes gathered to make lively this mini-India. 😊

Dhol baaje dhol!

Day Four

Games

Making the kids follow the instruction is a hurdle
It’s like getting the meaning of “stand straight in a circle”;
It’s only mothers who have their own jugaad
Without spoiling the child, they can spare the rod!

(Here, the original idiom “spare the rod and spoil the child” means ‘if the parents do not punish children when they do something wrong, children will not learn the correct things’.)

Game is the time when the child in everyone comes out
Be it young or old, tall or short, thin or stout;
Organizers had many ideas up their sleeve
Take it or leave it, nothing to make believe.

Can people run around crazily without any panic?
Yes. Here, the games are like the HR’s super tonic!
Run, think, guess, catch, approach and do whatever extra
Participate, whether it’s a win or loss, is the mantra!

The king of the games was “Make the pair, take the chair”
It’s the business of getting the partner in a battle-fair
Fun, frolic, music, magic, … just ask for that impulse
You would see it, if not in Vamsy, where else?

Games are fun.



Day Five

Ramp Walk

All the activities here have been fun-filled
Anybody could participate if they willed;
A stage where arrangements could be made to a stage
All jigrees join hands and amicably manage.

Organisers made the ramp walk with a difference
Leaving a lot of choice to the Father and Child’s preference;
A ramp walk is a ramp walk and no catwalk,
Act, dance, sing and exhibit the talent along with the walk.

Whatever you perform, you receive a pat
Everyone enjoys whether it’s thin or fat
Every performance is inimitable and bold
If you have missed it, elsewhere, your time was sold.

Vamsy Ramp Walk!

Day Six

The Best Ganeshji

Every flat to make the Best Home-made Ganeshji possible
How is it possible? … Tangible or intangible?
If tangible, then the yardstick could be still in the making
If intangible, anything could be used for Gananātha, the King.

Well, a tangible treat to the eyes … efforts by all are unfathomable
For creativity has no bounds … just laudable!
The idols are made of neither PoP nor clay
Yet, in all our minds, they are here to stay!

Utti or Uttu is a definite part of the festivities
Josh is the hosh … ecstasy at the peak of all activities;
Holding the baton, battling the gushing water
Focusing, jumping and hitting it is a youthful matter.

Drumming, singing, dancing, all happened simultaneously
No surprises, again, young and old did them continuously
Taking turns one after the other, seeming to be a saga,
It reached the Nimajjan stage, saying “… Agle baras tu jaldi aa.

Vamsy Ganesh Utsav T-shirt
Ganapati Bappa Moriya,
Agle Baras Tu Jaldi Aa.

Other Hallmarks

Sports

All sports conducted by the young colts
Chasing the participants for their slots
Is like a mother who runs after a child with food bowl;
They all desrve a big applause with no scowl.

Food Committee

The food committee in Vamsy is an asset with no investment
Their continuous presence at the kitchen is proof of their commitment
This year, the assurance of zero food wastage
Is an exemplary example of the best mileage!

Epilogue

This is a big joyous event in our mohalla
No doubt, all enjoyed the kheer in everyday’s pyalaa
We worship Rama, Siva, Hanuman, Durga and Nandlaala
Now, let’s bow to Lord Ganesha, for it’s all his ‘leela’.

“Om Sri Ganādhipataye Namaha!”🙏🙏🙏

Note: Please scroll down to leave your comments.

My YouTube Channel for English & Verbal Logic/Reasoning Videos:

https://youtube.com/@TSSMurty?si=oOMCLoseD2QZndFi7

(EP) 12. Voicing Silence

When a pregnant is taken into the labour room for delivery
The calmness outside the OT is the silence before the revelry;
When it is time for the baby to be ‘ooing’ on its mother’s lap
The shh… shh… gesture to others is the silence before the sleep.

In the school, when the Principal is on rounds to check the loud voice
The quick charades game by the students is the silence before the noise;
When the invigilator tries to trace the students daring
The speaking of their eyes is the silence before the sharing.

When the teacher asks a difficult question making things worse
Bending the head down or looking all around is the silence before the curse;
When one enters a library with whatever attire and sense
The “Silence please” board is the silence before the silence.

When a gathering has someone’s presence as a deficit
Their plastic smile echoes the silence before the exit;
When someone nonchalantly brushes aside questions with a smile
The facial expression alludes to the silence before the guile.

In Tennis, when the player is ready to serve in the game
The announcement to the spectators is the silence before the player’s fame;
In some sports, when the high-spirited spectators maintain silence
It can be imputed to their controlled silence before the violence.

When a member of the family makes a mistake
The head of the family’s composure is the silence before the take;
When a member of the family stops following the norm
The head of the family’s non-disclosure is the silence before the storm.

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(EP) 11. Ragging Riches

Gurupoornima, on this day
This, am I coerced to say?

As a child, I just got up when teacher entered the class
Always, wished them, inside or outside the class!
A teacher is a teacher, “That’s it”
Is what we were taught; is it bullshit?

How can anyone disrespect a teacher?
How come richness play the host cheater?
A rich kid can play the way he/she wants?
Aren’t their parents once students?

My respect and my students’ success are my pride
How come some parents’ riches take those for a ride?
Not all can be purchased with their money
Better known, ASAP, by Johnny, his kids and his honey.

👉 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(EP) 10. Giggees

-TSS Murty

I feel pinched,
When my abilities are treated as gibilities
When my inabilities are treated as ginebilities.
I feel pinched,
When my skills are treated as gills
When My falls is treated as geels.
I feel pinched,
When my activity is treated as geektivity
When my laxity is treated as geeksity.
I feel pinched,
When my smartness is treated as geetness
When all my clumsiness is treated as gimsiness.
I feel pinched,
When my reverence is treated as givarence
When my indifference is treated as gindifference.
I feel pinched very badly,
When my love is treated as “give”
And my row is also treated as “give”

Note: In most areas in India, people use expressions like “pen, ven”, box, vox”, etc. Similarly, in Telugu (referred to as the Italian of the East), there is an expression called “Giggeelu (గిగ్గీలు)”. Here, instead of /va/ sound in Hindi, for instance, we use the sounds /gi/ and /gi:/. This short poem is an effort to highlight the use of Giggeelu.

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(TP) 5. శునకరాజము

నేటి ప్రాత: కాలమున, ఎండ హెచ్చు కాకుండా, వాహ్యాళికి పోవుటకుపక్రమించితి.
పాదరక్షలు తొడిగి లిఫ్ట్ కడకేగితి.

పొరుగింటి పనివాడు బెల్టుతో కట్టిన పొట్టి కుక్కపిల్లతో వచ్చి ప్రక్కన నిలిచియుండెను.
కుక్క కూడ వాహ్యాళికి పోవుచుండెను!

వంటి నిండుగనే కాదు, దాని మొగము నిండుగా కూడ జూలు యున్నది.
మరి దాని చూపు ఎటు యున్నది?

నా ఆలోచన వినినట్లు అది తల ఎత్తి నా వైపు చూచినది.
"ఇవిగో నా కనులు," అని అది చెప్పినట్లున్నది.

తదుపరి, అది ఆ పనివాని వైపుకు చూచి, దాని కనులు పెద్దవిగా చేసెననిపించెను.
ఎందుకో, ఆ పనివాడు కూడ అటులనే చేసినాడు.

అది దాని ముందు కాళ్ళు పైకెత్తి, ఎగిరి దుమికినది.
ఆతడు, తన చేతులు దాని ముందు కాళ్ళ వలె పెట్టి ఎగిరి దుమికెను.

అప్పుడు అది దాని నాలుక బయటకు వ్రేలాడ వైచి, తోక ఊపెను.
మరి అతగాడు?

ఇంతలో లిఫ్ట్ వచ్చినది.
ముందు కుక్క ఎక్కినది!

నేను లిఫ్ట్ ఎక్కి, ఒక ప్రక్కకు జరిగి, వేసవి గాన, ఫ్యాన్ వేసితి.
గాలి కొరకు, పైన మధ్యలోనున్న ఫ్యాన్ వైపు చూచితి.

ఆ పనివాడు ఇంకొక ప్రక్కకు జరిగినాడు. కావున, ఫ్యాన్ క్రింద ఆ కుక్కపిల్ల వచ్చియుండెను.
దానికి ఫ్యాన్ గాలి బాగుగా తగులుచుండెను!

లిఫ్ట్ దిగి నేనొకవైపు తిరుగగా, అది ఇంకొక వైపు వెళ్ళుచుండెను.
గభాలున ఆగి, అది నా వైపు తిరిగి తన పొట్టి తోక ఊపెను.

గంట తరువాత నేను తిరిగి లిఫ్ట్ కడకు రాగా, అది మళ్ళీ వాహ్యాళికి బయలుదేరినది.
అది లిఫ్ట్ బయటుకు వచ్చి, నన్ను చూచి, మళ్ళీ తోక ఊపినది!

బహుశ: ఈ సారి ఫ్యాన్ వేయలేదేమో ... లేక అది దాని విశ్వాసమో!

ఇది శునకరాజము యొక్క అదృష్టమా, లేక మానవుని దురదృష్టమా?
ఎవరు ఎవరికి కావలి కావలెనో చెప్ప సాధ్యమా?

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(EP). 9. I Miss You

When I’m lonely, I miss you
When I’m away, I miss you
When in work place, I miss you
When I’m dining alone, I miss you
When in pensive mood, I miss you
When I’m distracted, I miss you
When I argue, I miss you
When it’s a face off, I miss you
When I’m angry, I miss you
When I’m very hungry, I miss you
When I’ve to agree, I miss you
When I’ve to disagree, I miss you
When I want to hug you, I miss you
When I want you to hug me, I miss you
Whenever you’re not with me, I miss you
Whenever I’m not with you, I miss you;


Why don’t I miss thinking of ‘I miss you’?
It’s a big mess because I miss you;
When you leave me in the lurch, I miss you
Still, I can’t call you a curse as I miss you;
I can’t help thinking of you — I miss you
Still you aren’t with me, I miss you;
I continue saying ‘I miss you’
Could I ever hear from you ‘I miss you?’
I long to stop saying, “I miss you”
Do tell me when I can feel you?
Because, it’s tough to live without you.

Oh “Peace of mind” … you can’t be so rude
I miss you, and I miss you, my invisible dude!

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(EP) 8. Generation or Gap?

I told my better half that it’s 30 years after
I received my first appointment order;
The looks were no broader.
I told my younger one about it,
The expression was no different.
I told my elder one and shared … that
The other two didn’t even congratulate me.
And I heard, “Why are you telling me?”
When asked, I told Alex the same,
He said, “Let’s celebrate big, Sam!”

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(TP) 4. నేనొక నెలజీతగాణ్ణి!

నేనొక నెలజీతగాణ్ణి,
నెలజీతం వస్తేనే నేను నార్మల్ గా ఉండ గలను;
రాకపోతే బాధ పడతాను.

నా జీతం పెరిగితే పండగలా అనిపిస్తుంది;
పెరిగే వరకు, రైతు ఆకాశానికేసి చూసినట్టు చూస్తాను.
నేనొక నెలజీతగాణ్ణి.

సరుకులు ఎక్కడ చవకగా వస్తే అక్కడే కొంటాను,
ఎంత దూరమైనా వెళ్ళి, ఎంత సమయమైనా వేచి.
నేనొక నెలజీతగాణ్ణి.

ప్రతి నెలా పద్దు వ్రాసుకుంటాను,
నా ఖర్చును, నా తాహతును త్రాసులో తూస్తాను.
నేనొక నెలజీతగాణ్ణి,

నేను పాంటు, షర్టు కుట్టించుకుంటే,
మిగిలిన ముక్కతో నా కొడుక్కి లాగూ కూడ, అని దర్జీకి అర్జీ పెట్టుకుంటా.
నేనొక నెలజీతగాణ్ణి.

నా పిల్లలు ఆకాశంలో ఎగిరే విమానం చూసి కేరింతలు కొడుతూంటే
ఆలాంటి విమానం వాళ్ళు ఎక్కి తిరిగే రోజు రావాలని కోరుకుంటా.
నేనొక నెలజీతగాణ్ణి.

రోడ్డు మీద పెద్ద కారు వెళుతూంటే, చూసినందుకే మురిసిపోతా,
నాకున్న రెండు చక్రాల వాహనంలోనే గొప్పగా తిరిగేస్తా.
నేనొక నెలజీతగాణ్ణి.

పిల్లల కోసం నెలనెలా కూడబెడతా,
వారి భవిష్యత్తుకే పెద్దపీట వేస్తా!
నేనొక నెలజీతగాణ్ణి.

కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఇరవై ఏళ్ళ ప్రణాళిక వేస్తా,
వారం రోజుల్లో ఖర్చు చేసేసేందుకు పలు విధాల పోగేస్తా.
నేనొక నెలజీతగాణ్ణి.

పిల్లల చదువుల కోసం పీఎఫ్ వాడేస్తా
నా భార్యకి జత గాజులకై ఇచ్చిన మాట గట్టు మీద పెడతా.
నేనొక నెలజీతగాణ్ణి.

పెరిగిన జీతం, పెరిగిన ఖర్చులకు సరిపడక,
విత్తనాలు జల్లి వారాల తరబడి వర్షపు జల్లుకై ఎదురు చూసే రైతులా చూస్తా.
నేనొక నెలజీతగాణ్ణి.

అప్పు ఇవ్వాలన్నా, అప్పు చేయాలన్నా,
పయనము ఆగినట్టుంటుంది, ప్రాణం పోయినట్టుంటుంది.
నేనొక నెలజీతగాణ్ణి.

రిటైరు అయ్యే సరికి ఇల్లు కట్టుకుందామనుకుంటా,
ఆ అంకంలో అది ఎంత వెర్రిబాగులతనమో అక్కడి గోడలు చెబితే వింటా.
నేనొక నెలజీతగాణ్ణి.

ఆశలు ఎన్నున్నా, ఆశయాలు ఎన్నున్నా,
నా జీతం జీర్ణించుకోగలిగితేనే ఆలోచిస్తా.
నేనొక నెలజీతగాణ్ణి.

నా నుదుటన, అరచేతిలోన ఉన్న రేఖలు
బహుశ: లక్ష్మణుడి బాణంతో వ్రాయబడ్డాయి; దాటలేను.
నేనొక నెలజీతగాణ్ణి.

నా జీతమే నా జీవితం ౼ నా ఆధారం,
నా వర్తమానం, నా దృష్టిలో ప్రవర్ధమానం!

నేనొక నెలజీతగాణ్ణి,
నెలజీతం వస్తేనే నేను నార్మల్ గా ఉండ గలను;
రాకపోతే బాధ పడతాను.

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కం.
విందున షడ్రుచులన్నియు
అందున జిహ్వ కొక రుచిగ ఆస్వాదింపన్,
సందడుల పలుకరింపులు
కందము, శ్రీ శోభకృత్ కి కాంక్షింపంగన్!

9. కొలత

“ఎసరు పెట్టేస్తుంది అమ్మ. బియ్యం కొలిచిన గ్లాసు ఎక్కడ పెట్టావు ప్రియ వదినా?” అంటూ బయట నుండి అరుస్తూ అడిగింది మా చిదానందం అన్నయ్య భార్య, అదే, మా పెద్దనాన్న కోడలు. నేను బాల్కనీ వైపు ఉన్న బాత్రూములో ఉన్నాను. ఏదో ఆలోచనలో ఉన్న నాకు, ఒక్కసారి షాక్కొట్టినట్టు అనిపించింది. “ఒక్క నిమిషంలో వస్తున్నా,” అని చెప్పి ఆగమన్నాను. “అలాగే,” అని చెప్పి తను లోపలికి వెళ్ళినట్టు అనిపించింది. గబుక్కున అక్కడే ఉన్న ప్లాస్టిక్ స్టూల్ మీద ఒక్క సారిగా చతిగిలబడ్డాను. బుర్ర తిరిగి పోతున్నట్టు అనిపించింది. మనస్సు వెనక్కి పరుగులు తీసింది.

నేను కూర్చున్నది ఒకే ఒక పెళ్ళిచూపులలో. అదీ మా ఆయన నన్ను చూడడానికి వచ్చినప్పుడు. నాన్న చిన్ననాటి స్నేహితుడి కొడుకు. ఆ చనువు ఉంది కనుక, వాళ్ళు కబురు పెట్టక ముందే నేను వాళ్ళ అబ్బాయికి నచ్చానో లేదో తెలుసుకోవాలని నాన్న ఆతృతగా వాళ్ళింటికి వెళ్ళారు. ఆ మహా నగరంలో మేమొక మూల ఉండే వాళ్ళము. నాన్న తన ఆఫీసుకి వెళ్ళి, అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికి మధ్యాహ్నం అయింది. నాన్న ఫోన్ కాల్ కోసం ఇంట్లో అందరం ఎదురు చూస్తున్నాము. ఫోను మ్రోగితే చాలు, నాన్నే చేశారేమోనని ఆతృతగా మాట్లాడేయడమే. కాదని తెలిసి నాలుక కరుచు కున్నాము. అలా చాలా సార్లు అయింది అవాళ.

అలా ఫోను మ్రోగిందంటే చాలు, ఆతృతగా పరుగున వెళ్ళి రిసీవర్ తీయడం, ఎవరో చేశారని అమ్మకిచ్చి, ఆందోళనగా అక్కడనుండి  వెళ్ళిపోవడం. ఇదంతా చూసి, అమ్మ, “ఎందుకే పిచ్చి పిల్లా అంత హడావిడి. సంబంధం కుదరడమంటే అంత తేలికేం కాదు. ఫోన్ వస్తుందిలే. టైం మూడు కొట్టింది. ముందు కొంచెం ఎంగిలి పడు. ప్రొద్దున్నుండీ ఏమీ సరిగ్గా తినలేదు. అసలే నీ తిండి అంతంత మాత్రం. అయినా నాన్న అతని గురించి అన్నీ వాకబు చేయించారుగా.అంతా చక్కని కుర్రాడేనని చెప్పారుగా. ఇంకా ఎందుకీ ఆందోళన? రా. కొంచెం పెరుగన్నమన్నా తిను,” అంది. “అందుకే కదమ్మా  నా ఆదుర్దా కూడా. ఇలాంటి సంబంధం కుదరాలనే. బావ ఎట్లాగో మనలో సరిగ్గా కలవడు. కనీసం నన్ను చేసుకునే అతనైనా మనలో కలిసే మనిషైతే చాలు. ఇతనితో మాట్లాడినప్పుడు నాకు ఆ కలివిడి లక్షణం బాగా నచ్చిందమ్మా,” అన్నాను. అంతే, అమాంతం వచ్చి నన్ను హత్తుకుని కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మ. ఆడపిల్ల మెట్టినింటి గురించి వంద రకాల ఆలోచిస్తారు తల్లిదండ్రులు. అలాగే, ఆ వచ్చే అల్లుడు ఇక్కడ కూడ కలివిడిగా ఉండాలనుకోవడం పరిపాటే కదా!

ఇంతలో మళ్ళీ ఫోన్ మ్రోగింది. ఈ సారి అమ్మే తీసుకుంది. నాన్నే ఆ ఫోన్ చేసింది. నాన్న చెప్పింది విని, నా కేసి చూస్తూ నవ్వింది. “కాయా? పండా?” అనే సైగ చేసి అడిగాను ఆదుర్దాగా అమ్మని. సంతోషంగా నవ్వుతూ, “పండే” అని చెప్పి రిసీవర్ నాకిచ్చి నాన్నతో మాట్లాడమంది. అదే వార్త నాన్న నాకు చెప్పి విష్ చేశారు. తరువాత ఆయన కూడ “హాయ్. కంగ్రాట్స్” అన్నారు. చాలా ఆనంద పడ్డాను. అఫ్ కోర్స్, దానికి అవధులు ఏముంటాయి!

తరువాత, ఆయన చెల్లెలు కూడ ఫోన్ తీసుకుని, “హార్టీ కంగ్రాట్యులేషన్స్,” అంది. “థాంక్యూ. నీ పేరేంటి? మనమిద్దరం ఒకే ఏజ్ వాళ్ళం కదా … అందుకోసం పేరు పెట్టి పిలుచుకుందాము” అన్నాను. అదే నేను వేసిన మొట్టమొదటి తప్పటడుగు. పెళ్ళి కుదిరిన ఆనందంలో మైకం కమ్మిందా? … అయ్యుండచ్చు.

మా వివాహం జరిగింది. కొద్ది నెలలు గడిచాయి. మా అత్తారింట్లో సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువు పెడతారు. మా ఆయన కూడ చాల సరదాగా చేయగలిగినవి చేస్తారు. పండుగ రోజు సాయంకాలం చుట్టాలను, చుట్టుపక్కల వారిని పేరంటానికి పిలిచాము. మా అమ్మ, అక్క కూడ వచ్చారు. మా పుట్టింట్లో ఈ బొమ్మల కొలువు ఆనవాయితీ లేదు. అదీగాక, నేను ఎప్పుడూ ఇలాంటి వాటిల్లో పెద్దగా ఆసక్తి చూపించ లేదు. మా అత్తగారు నా చేత కూడ బొమ్మలు పెట్టిచ్చారు. ఏదో ముభావంగానే చేశాను. అదీగాక, ఎప్పుడు ఈ గోల అయిపోతుందా, వెళ్ళి భోజనం చేసి పడుకుందామా అని ఎదురుచూస్తున్నాను.

ఇంతలో మా ఆయన కజిన్, వాళ్ళ బాబాయి కూతురు, ఆమె భర్త వచ్చారు. ఆమె, మా ఆయన చెల్లెలికన్నా కొద్ది నెలలు పెద్దది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం టైములో మా ఆయన చెల్లెలి మీద నాకు ఏదో విషయం మీద కోపం వచ్చినందున, వాళ్ళ బాబాయి కూతురు రాగానే, అంతవరకు పేరంటానికి సంబంధించిన ఏ విషయంలోనూ ఇంట్రస్ట్ చూపించని నేను, గబుక్కున వెళ్ళి “రా వదినా,” అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకు వచ్చాను. ఉన్నట్లుండి అందరూ నా వైపు అదోరకంగా చూశారు … మా అమ్మ, అక్కతో సహా. వాళ్ళ బాబాయి కూతురు కూడ కొంచెం ఎబ్బెట్టుగా ఫీల్ అయింది.

పేరంటం ఆల్మోస్ట్ అయిపో వచ్చింది. ఆడ వాళ్ళ పేరంటం కదా, మగవాళ్ళందరూ లోపల ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో అమ్మ మా అత్తగారి దగ్గరకెళ్ళి, మా నాన్నకి కొంచం బెంగగా ఉంది, నన్ను తనతో తీసుకెళ్ళి, రెండు రోజులు ఉంచుకుని పంపుతానంది. ఆవిడ సరే అనడంతో మా ఆయనకి కూడ చెప్పి నన్ను తనతో తీసుకెళతానంది. మా ఆయన వచ్చి, నన్ను, అమ్మని, అక్కని బస్సు ఎక్కించి వెళ్ళారు. నేను ఉన్నట్లుండి ఎందుకు వెళ్తున్నానో నాకు అర్థం కాలేదు.

ఇంటికి వెళ్ళిన తరువాత, అందరం కూర్చుని భోజనం చేస్తున్నాము. అమ్మ, వడ్డిస్తోంది. నాకు ఇష్టమని అప్పటికప్పుడు, అమ్మ పరవన్నం చేసింది. కప్పులో మారు వడ్డిస్తూ తీయగా, “నువ్వు చేసింది చాల పెద్ద పొరపాటు,” అంది అమ్మ నాతోటి. దారి పొడుగునా అమ్మ నాతో ముభావంగానే ఉంది. “తను నాతో ఎట్లా ఉంటుందో నీకు తెలుసా?” అన్నాను కొంచెం గట్టిగా. “ఔనమ్మా, అలాంటి వాళ్ళకి అలాగే బుద్ది చెప్పాలి,” అంది అక్క వంత పాడుతూ. నాకు విపరీతమైన ఉత్సాహం వచ్చింది. “నువ్వు నోరు ముయ్యి,” అని కళ్ళెర్రజేసి గట్టిగా అరిచారు నాన్న అక్కకేసి చూసి.

నాన్నని అంత కోపంగా నేనెన్నడు చూడ లేదు. అసలు అమ్మ నాన్నకి ఆ విషయం ఎప్పుడు చెప్పింది కూడ మాకు తెలియదు. అదీగాక, కూతుళ్ళంటే ఆయనకి చాల ఇష్టం.

“నీ బిహేవయర్ మూలంగానేగా మీ ఆయన, మీ అత్తారుకి, మాకు ఎడమొహం పెడమొహం అయ్యింది. అది చాలదన్నట్లు చిన్నల్లుడిని కూడ కలవకుండా చేస్తావా? ఏ తల్లిదండ్రులయినా కూతురు పెళ్ళి చేశాకా కూతురు, అల్లుడు … ఇద్దరూ వచ్చి వెళ్ళాలనుకుంటారు. ఇలా కూతురిని ఇంటికి తెచ్చుకోవాలనుకోరు. ఆ స్నేహం ఎలాగూ చెడగొట్టావు. నీ కాపురం నువ్వు చూసుకో. చిన్న దాని విషయంలో ఇంకెప్పుడూ తల దూర్చకు,” అంటూ నాన్న కంటిన్యూ చేశారు.

అదేంటి … నన్ను ఇక్కడకి తీసుకొస్తానని కదా అమ్మ అక్కడ చెప్పింది. మరి నాన్న అలా అన్నారేంటి? మతి పోయి నేను, అక్క ఒకరినొకరు చూసుకున్నాము. ఇద్దరికి నోరు పెగల్లేదు.

అప్పుడు అందుకుంది అమ్మ.

“నన్ను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నావు? ఆయనని నాన్న అని ఎందుకు పిలుస్తున్నావు? దాన్ని అక్క అని ఎందుకు పిలుస్తున్నావు? మీ మేనత్తలని, మేనమామలని ఆ బంధుత్వంతో ఎందుకు పీలుస్తున్నావు? ఎందుకంటే, ఇవి బంధుత్వాలు కనుక. పెళ్ళయ్యాకా, మెట్టినింటి కెళ్ళాకా, ఆడపిల్ల ఆడ పిల్లే అంటారు … ఎందుకు? ఎందుకంటే అక్కడ బంధుత్వం ఏర్పడుతుంది కనుక. అది మన అందరికి. కాని, నీకు దానితోపాటు బంధం, అనుబంధం కూడ ఏర్పడ్డాయి. కాదా? నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన దానివి. అక్కడ బంధుత్వాన్ని చెడ గొట్టుకుని వాళ్ళ బంధువులతో బంధుత్వం నిలుపుకుంటావా? ఇదేనా నీ చదువు నీకు నేర్పింది? … నువ్వు నీ అహంకారంతో గమనించ లేదు కాని, నీ ప్రవర్తన మీ ఆయన చూశాడు. అందుకే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు … మీ ఆయన చెల్లెలికి నీ వయసే ఉంటే పేరు పెట్టి పిలుస్తున్నావు … మరి వాళ్ళ బాబాయి కూతురిదీ అదే వయసుగా? అక్కడ బంధుత్వం కలిసిందా నీకు? ఏవైపు నుండి … నా తరఫునుండా లేక మీ నాన్నగారి తరఫునుండా? అసలు ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయమైంది? నీ పెళ్ళి కుదిరాకే కదా? కాని, నీకు ఆ అమ్మాయితో చుట్టరికం ఉన్నట్లు, నీ సొంత ఆడపడుచుతో ఏమీ లేనట్లు అంత మందిలో ఎలా ప్రవర్తించాలనుకున్నావు? అంత కన్ను మిన్ను కానకుండా బ్రతికేద్దాము అనుకుంటున్నావా? రేపు మీ ఆయన అడిగితే ఏం సమాధానం చెబుదామనుకుంటున్నావు? అతనికి నీ సమాధానం కచ్చితంగా నచ్చదు. అతని చూపులోనే ఆ సమాధానం ఉంది. అసలు నీ మాట వినడానికి కూడ ఇష్ట పడకపోతే ఏంచేస్తావు? కూర్చున్న కొమ్మ నరుక్కుని వచ్చి ఇక్కడ తిష్ట వేస్తావా? అందుకేనా అంత కష్టబడి సంబంధం చూసి నీకు పెళ్ళి చేసింది? నువ్విలా గిల్లికజ్జాలు పెట్టుకుని వచ్చి మా నెత్తినెక్కి కూర్చుంటావా? అయినా, తప్పు నీది కాదు. నాది. నీ పెళ్ళి కుదిరిన వెంటనే నువ్వు మీ ఆడపడుచుని “పేరు పెట్టి పిలుస్తా” నన్నప్పుడే నేను వారించి ఉంటే, విషయం ఇంత దూరం వచ్చేది కాదు. మీ నాన్న అక్కడి నుండి మాట్లాడారుగా. అందుకే ఆయన దృష్టికి వెళ్ళ లేదు. లేకపోతే అప్పుడే విషయం మారి పోయేది … మీ ఆయన చూసిన చూపుకి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చెప్పు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? వచ్చి, మీ అత్తారింట్లో నిన్ను సమర్ధించి, మీ ఆయనని ఎదిరించి, దెబ్బలాడి, బెదిరించి నిన్ను మీ ఆయనతో చక్కగా కాపురం చేసుకోమ్మా … అని దింపి రావాలా? మీ నాన్న స్నేహితుడు ఒకరు అలానే చేశారు. “నా కూతురిలో పది తప్పులుంటే, నీలో ఒక్క తప్పైనా పట్టుకోలేనా?” అంటూ వాళ్ళ ఇంటికెళ్ళి  అల్లుడిని గొడవ చేశాడట. ఏం జరిగింది? కూతురుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమి, ఆయనకేనా రోషం? అల్లుడికి ఉండకూడదా? తమ్ముడికి సంబంధాలు చూస్తున్నాము కద; ఆ వచ్చే అమ్మాయి కూడ నీలాగే ఉంటే మనం మాత్రం భరించగలమా. ఇక్కడ నువ్వు కూతురువి. కాని, అక్కడ కోడలివి. ఇది గుర్తుంచుకుని మసలుకో … ఈ విషయంలో మేము నిన్ను సమర్ధిస్తే ఇది జీవితాంతం రగులుతూనే ఉంటుంది. అందుకే విషంయం చిన్నదిగా అనిపించినా, గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇది ఇక్కడే వదిలేస్తే ఎంతదూరమైనా వెళ్ళే అవకాశముంది. కాబట్టి, నీ తప్పు నువ్వు తెలుసుకుని, నిన్ను నువ్వు సరి దిద్దుకో. అనవసరమైన మాటలు మొదలెట్టింది నువ్వే కాబట్టి, చిన్న పశ్చాత్తాపంతో పోయే విషయాన్ని గొడ్డలి వరకు తీసుకురాకు. ఇలాంటివి చిన్నగానే కనిపించినా, వాటి లోతు తెలుసుకుని మసలుకోవాలి. అందుకే ఇంత గట్టిగా చెబుతున్నాను … ఈ విషయంలో నీకు మా దగ్గర నుండి ఏ రకమైన సమర్ధింపు రాదు. ఇక మీదట, నువ్వు ఇలా వస్తే తలుపు కూడ తియ్యమని మీ నాన్నగారు గట్టిగా చెప్పమన్నారు. మా ఆయన చెప్పింది నేను విన్నాను. రెండు రోజులు అని చెప్పి తీసుకొచ్చాను. కానీ, ఈ పూటకి ఎక్కువ ఆలోచించకుండా పడుకుని, రేపు ప్రొద్దున్న బయలు దేరి వెళ్ళి, మీ ఆయన చెప్పినట్లు నువ్వు విను.”

నాన్న లేచి అవతలకి వెళ్ళి పోయారు. అంత ఆవేశంతో మాట్లాడిన అమ్మ, ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంది. అమ్మ చెప్పిన మాటలకి అర్థం మెల్లిగా తెలియడం మొదలుపెట్టింది. అంతే, నేను తెలిసీ తెలియక చేసిన ఒక తప్పు రెండు కుటుంబాల మధ్య ఇంత వైరం, దూరం పెంచుతాయి అనుకోలేదు. ఒక్క సారిగా బాధ ముంచుకొచ్చేసింది. అంతే, అమాంతం వెళ్ళి అమ్మని గట్టిగా పట్టుకుని బోరున ఏడ్చేశాను.

గీజరు సౌండ్ ఆగింది. కుక్కర్ సౌండ్ వినిపించింది. వంటింలోకి వెళ్ళి అడిగాను, “ఏ గ్లాసుతో పోశారు బియ్యం గిన్నెలో నీళ్ళు?” అని. మా అన్నయ్య భార్య, వాళ్ళ అమ్మ కూడ ఏదో నవ్వు నవ్వి ఊరుకున్నారు. అన్నయ్యా వాళ్ళు ఏదో పనిమీద వెళుతూ మా ఊళ్ళో ఒక రోజు ఉందామని వచ్చారు.

తరువాత తెలిసింది … కుక్కర్ వేడెక్కి ఉంటే, మా మామ్మ చెప్పినట్టు నీళ్ళు వ్రేలితో కొలిచి పోసి, బియ్యం గిన్నె కుక్కర్లో పెట్టింది మా అన్నయ్య అని. విషయమేమిటంటే, అతని భార్య కూడ తన సొంత ఆడపడుచుని ‘వదినా’ అని పిలవదు!

ఈ రోజు నాకు చేతి నిండా పనే. ఎసరు, అత్తెసరు … రెండింటి కొలతా ఈ తల్లీకూతుళ్ళిద్దరికీ నేర్పాలిగా!

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

8. వైద్యులు 🩺

“వైద్యో నారాయణో హరి:” అన్నారు పెద్దలు. వారి ఉద్దేశాలు ఏమైనా వైద్య వృత్తికి వన్నె తెచ్చే పరంపరలో లీనమైపోయినవాళ్ళు ఇంకా ఉన్నారనడంలో చాలా ఆనందం కలుగుతుంది కదా! కడుపు నొప్పో, కాలు నొప్పో వస్తే క్షణం పాటు ఆలోచించకుండా ఆసుపత్రికి పరుగులు తీసే వాళ్ళూ ఉన్నారు, వంటింటి చిట్టి చిట్కాలు పాటించి నయం చేసుకునే వాళ్ళూ ఉన్నారు. అలాగే, రోగి దొరికితే చాలు వడ్డించ్చేద్దామనే వైద్య శిఖామణులు ఉన్నారు, చికిత్స అవసరం లేకపోతే పైసా ఫీజు తీసుకోకుండా “ఇది మిమ్మల్ని ఏమీ చేయదు. ఇంక దీని గురించి మరచిపోండి” అని ధైర్యం చెప్పి పంపించేసే వైద్య నిపుణులూ ఉన్నారు. అన్నిటికి మించి వైద్యుడి అవసరం చెప్పే సుమతీ శతకంలోని పద్యం చదవని లేక వినని తెలుగు వారు ఉంటారా (అదేనండి, “అప్పిచ్చు వాడు, వైద్యుడు …” అనే పద్యం)! మరి వైద్యులు మనకి అంత అవసరం.

కొంత వయసు వచ్చేసరికి, ఈ రకం వైద్యులనీ, ఆ రకం వైద్యులనీ కూడా మనం చూడక తప్పదు. కాబట్టి ఇరు వర్గాల ఇంగితమూ మనకు తెలుస్తుంది. అందుకే, కారణాలు వేరైనా, ఇద్దర్నీ గుర్తు పెట్టుకుంటాము. ఈ కోవలో మన మనసుకు నచ్చే అతి తక్కువ మంది నాకూ తారస పడ్డారు. వారి గురించి వ్రాయడంలో ఎంతో ఆనందం కనిపిస్తోంది.

డాక్టర్. రామనాథ్ చౌదరి గారు, అమీర్‌పేట్, హైదారాబాద్

డాక్టర్ దగ్గరికి అవసరమైతేనే వెళ్ళాలిట. మేము ఈయన దగ్గరికి జ్వరానికో లేక బాగా జలుబు భారం చేస్తేనో వెళ్ళే వాళ్ళము. మొదటిసారి వెళ్ళినప్పుడు ఆయనని చూడగానే కించిత్తు భయం వేసింది. వెళ్ళిన ప్రతీసారీ కొంచం భయం అలానే ఉండిపోయింది.

పొడుగాటి విగ్రహం. ఉన్న వెంట్రుకలతో వెనక్కి దువ్విన నల్లటి జుట్టు. ఆ జుట్టు మధ్యలో ఆయన మనవళ్ళు చాక్‌లెట్లు దాచుకునేంత చోటు! టిప్పుటాపుగా ఇస్తిరీ నలగని వైట్‌ ఫుల్‌షర్టు, బ్లాక్ పాంటు. నీటుగా పాలిష్ చేసిన లెదర్ షూజ్. మెడలో టై. అస్సలు ఎక్స్ప్రెషన్స్ లేని ఫేసు. ఆహార్యానికి తగ్గ గాంభీర్యం. అలా అని కోపిష్టి కాదు సుమీ.

లోపల ఉన్న పేషంట్ బయటకి రాగానే, ఆయన కూడా వాళ్ళ వెనకాలే వచ్చి, “ప్లీజ్ కమిన్” అని లోపలికి పిలిచి, కూర్చోమని, “చెప్పండి. ఏమిటి ప్రాబ్లమ్?” అని అడిగే వారు. చెప్పినదంతా ఓపిగ్గా విని, ఆయన అడిగేవన్నీ అడిగి, ప్రిస్క్రిబ్షన్ రాయటం మొదలు పెట్టేవారు. ఒకప్పుడు విన్నాను: విదేశాలలో ఉన్న ఒక డాక్టరు ఇండియాలో ఉన్న తన భార్యకి ఉత్తరం వ్రాస్తే, గేటు దగ్గర ఉత్తర పురుషుడి (పోస్ట్ మాన్కి జంధ్యాల గారి పదం) నుండి అది పుచ్చుకుని ఇంటిలోకి కాకుండా బయటకు వచ్చేసి, ఆ వీధిలో ఉన్న మందుల దుకాణానికి ఆవిడ పరిగెత్తిందని. అయితే, మా డాక్టర్ చౌదరి గారి చేతి వ్రాత తీరు అది కాదు. ఆయన వ్రాసింది ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకున్న ఏ విద్యార్థి అయినా చదివేయగలడు. దానికోసం మందుల దుకాణానికి పరిగెత్తే అవసరం అస్సలు ఉండేది కాదు. కార్పరేట్ భాషలో చెప్పాలంటే, ఆయన దస్తూరి “పేషంట్ ఫ్రెండ్లీ”. దీనికి ముందు, తన స్టెతస్కోప్‌ని పేషంట్ ఛాతికి మరియు వీపుకి పెట్టి, “ఊపిరి తీసుకోండి. ఇప్పుడు వదలండి,” అంటూ ఎటో చూస్తూ అదే గంభీరమైన కంఠంతో చెబుతారు. “ఆ … ఊపిరి తిత్తులు క్లియర్‌గానే ఉన్నాయ్,” అనేవారు. అది ఏమాత్రం ఏమరుపాటు కాదు. పద్ధతిగా, శ్రద్ధగా చూడడం.

“ఇది ప్రొద్దున్న ఒకటి, రాత్రికి ఒకటి. రెండోది ప్రొద్దున్న, మధ్యాహ్నము, రాత్రి ఒకటి చొప్పున వేసుకోవాలి. మూడోది సిరప్. రోజుకి రెండు సార్లు తీసుకోవాలి — ప్రొద్దున్న, మధ్యాన్నము. అన్నీ ఏదైనా తిన్నాకే వేసుకోవాలి. లేకపోతే పనిచేయవు. మూడు రోజులు వాడి, గుణం కనిపించక పోతే, మళ్ళీరండి. తగ్గిపోతే, రానవసరం లేదు” అని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అదే  ఎక్స్ప్రెషన్ లేని ఫేసుతో గంభీరమైన కంఠంతో చెప్పేవారు. మొదటిసారి వెళ్ళిన వారికి, ప్రైమరీ స్కూల్ విద్యార్ధికి బెత్తం చూబిస్తూ చెప్పే హెడ్ మాస్టర్‌లా అనిపిస్తారు. కానీ, అది నిజం కాదని క్రమేపీ తెలుస్తుంది. “డాక్టరు గారూ, ఫీజు ఎంత?” అని అడిగిన వెంటనే, “పది రూపాయలు,” అని ఖంగున పలికే స్వరం వినిపించేది. కనీసం డెభ్భైయ్యో, ఎనభయ్యో పుచ్చుకునే రోజులలో వారి ఫీజిది. ఆ ఫీజు వినగానే కొంతమంది సగటు జీతగాళ్ళకి సగం జ్వరం జారిపోతుంది. ప్రొద్దున్న మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు ఆయన క్లినిక్‌లో ఉండే వారు. మరి అంత తక్కువ ఫీజేమిటి అని అనిపించవచ్చు. “ఆయన పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆయనకి టైమ్‌పాస్ కోసం ఈ క్లినిక్” అనే వాళ్ళు కొందరు. అయితే మాత్రం తక్కువ ఫీజెందుకు తీసుకోవాలి? ఆలోచించిన వారికే అర్థమౌతుంది!

పిల్లలు చాలా హుషారుగా ఉండాలని చెప్పేవారు. రోజూ ప్రొద్దున్నే రన్నింగ్‌ చేయమనేవారు. వ్యాయామం వంటికి మంచిది, క్రమం తప్పకుండా చేయమనేవారు. ఆయన మాటలన్నీ క్లుప్తంగానే ఉంటాయి. అలా అని మితభాషి అని అనుకోను. అవసరమైనంతా మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ వినరు. ఒక్కోసారి “మందులు ఎలా వాడాలో నేను ఇప్పుడు చెప్పింది నాకొక సారి చెప్పండి” అనేవారు. ఇచ్చిన మందు టైమ్లీగా వాడాలన్నదే వారి ఉద్దేశ్యం. వచ్చిన రోగి మళ్ళీ వారి గడప త్రొక్కద్దన్నదే వారి శ్వాసలోని ఆశ మరియు ఆశయం. 🙏🙏🙏

డాక్టర్. రామ్మూర్తి గారు, సూళ్ళూరుపేట

అది సెప్టెంబర్ 2000. నెల్లూరులో పనిచేస్తున్న నేను సూళ్ళూరుపేటలో ఉన్న మా బాబాయి ఇంటికి వెళ్ళాను. వాతావరణ మార్పో మరే పైత్యమో తెలీదు కానీ, నాకు విపరీతమైన దగ్గు మొదలయింది. తెరిపి లేకుండా.

మధ్యాహ్నం వాళ్ళింటికి వెళ్ళిన నాకు ఏ మాత్రం దగ్గొస్తుందనే డౌట్ వచ్చినా, అసలు వెళ్ళే వాడిని కాదు. అలా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సబబు కాదు గద. కానీ, సర్ఫ్ ఎక్సెల్ అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టు “మరక మంచిదే” అన్నట్లు నాకు వైద్యుడైన ఒక మంచి మనీషి చేతి వైద్యము, సింపుల్గా సింప్లిసిటీని ఆచరించి చూపే వ్యక్తిత్వము తెలిశాయి. లేకపోతే, ఇలా తెల్ల కాగితాన్ని నల్ల సిరాతో ఖరాబు చెయ్యడం కుదిరేది కాదుగా (ఇలా ఓ మహాకవిని కూడ తలచుకోవడం మహదానందకరం)!

అయితే, కాస్త పరవాలేదనుకున్న దగ్గు, రాత్రి భోంచేసి పడుకున్న తరువాత విజ్రుంభించింది. పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు. పైపెచ్చు, నా దగ్గు మిగతావారికి కూడ నిద్రాభంగమనే ఆలోచన ఇంకా బాధ పెట్టనారంభించింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి నాకు తెలియకుండానే నేను సొమ్మసిల్లి నిద్ర పోయే వరకు నాకు తోడుగా ఉన్న హాల్స్ బిళ్ళలకి తెల్లవారి లేవగానే నా నీరాజనాలు అనుకున్నాను. బహుశ, భగవంతుణ్ణి కూడ ఆ సమయంలో అంతగా తలచుకోలేదేమో!

పొద్దు పొడిచింది. దినకరుడి దినచర్య మొదలైంది. నేను టూత్ బ్రష్ కి హాయ్, బాయ్ చెప్పాను. శుభ్రతలో డిగ్రీలివ్వని ఓ పది పీఎచ్డీలు చేసిన మా పిన్ని నాకు బోర్నవీటా కలిపిచ్చింది. బాబాయి ఫిల్టర్ కాఫీ తాగుతున్నాడు. ఇదేమిటి? నేను ఏమైనా బడికి వెళ్ళే వయసులో ఉన్నానా? … అనే సందేహం మీకు రావచ్చు. ఏమాత్రం కాదు సుమీ. అప్పట్లో, మా ముందు తరం వాళ్ళు విపరీతంగా కాఫీకి అలవాటుపడ్డ కారణంగా, మా తరాన్ని దాని ఛాయలకి కూడ రానివ్వలేదు. కాకపోతే, వాళ్ళకి అవసరమైతే పెట్టివ్వాలి గనక, మాకు కాఫీ పెట్టివ్వడం మాత్రం నేర్పించారు.

“ఏరా, దగ్గు ఎక్కువైనట్టుంది? తొమ్మిదింటికి ఊళ్ళో డాక్టరుగారు ఉంటారు. రెడీ అయితే వెడదాము. కొంచం యాంటిబయోటిక్ తీసుకుంటే మంచిది. త్వరగా నయమవుతుంది” అన్నాడు బాబాయి.

ఇద్దరము బయలుదేరాము. బాబాయి, ఒక పెంకుటింటి దగ్గర బండి ఆపాడు. అక్కడ ఎందుకు ఆగామో నాకు అర్థం కాలేదు. ఆ ఇంటి వరండాలో మాత్రం ఒక మందుల దుకాణం కనిపించింది. మే బీ, ఆ దుకాణం లోపలో, పక్కనో, వెనకాలో డాక్టరుగారి క్లినిక్ ఉంది గాబోలు అనుకున్నాను. కానీ ఆ చుట్టుపక్కల ఏమీ కనిపించలేదు. ఇదేమిటా అని రెండు కళ్ళతో నాలుగు దిక్కులూ చూస్తున్న నాకేసి చూసి, “ఏంటి దిక్కులు చూస్తున్నావు? ఇలా రా” అని అదే వరండాలో ఉన్న ఒక బెంచీ మీద తను కూర్చుని, నన్ను కూడ కూర్చోమన్నాడు బాబాయి.

కూర్చుని, హెడ్ రైట్ టర్నింగ్ ఇచ్చు కున్నాను. సిటీ బ్రెడ్ వాళ్ళకి ఇది ఒక కల్చరల్ షాక్ లాంటిది అని నిస్సందేహంగా అనవచ్చు. స్కూల్లో హెడ్ మాస్టరు ఒక టేబులు, కుర్చీ వేసుకుని కూర్చున్నట్టు ఒక డెబ్భై ఏళ్లు పై బడిన పెద్దాయన తెల్లటి ఫుల్ షర్ట్ వేసుకుని కూర్చుని, బల్లకి ఇటువైపు కూర్చున్న ఇంకొకరితో మాట్లాడుతున్నారు. ఆ పెద్దాయన చాల నెమ్మదిగా మాట్లాడుతున్నరు. ఇంతకీ ఇక్కడ ఎందుకు కూర్చున్నామని బాబాయిని అడుగుదాము అనుకుంటూనే కొంచం తలకాయ అటూ ఇటూ తిప్పి చూస్తే అర్థమైంది. ఆ పెద్దాయన మెడలో స్టెతస్కోప్ ఉంది. ఎందుకో తెలియదు … ఇంకా తలకాయ అటూ ఇటూ తిప్పితే కనిపించింది … ఆయన క్లినిక్ బోర్డ్.

పెద్దగా ఆలోచనలేమీ లేకపోయినా, ఎందుకో తెలియని కతూహలం మొదలయింది. డాక్టరంటే మాంత్రికుడి ప్రాణంలా లోపలెక్కడో కూర్చుంటారు. ఇవతల రిసెప్షన్. అక్కడ ముందు టోకెన్ తీసుకోవాలి. అదీ ఆ రోజుకి దొరికితే. లేకపోతే, ఆ రిసెప్షనిస్ట్ ని బతిమాలో, బామాలో, అశ్వత్థామ హతః కుంజరః అనో, ఆ రోజు అపాయింట్మెట్ తీసుకుని వైద్యులవారికి, మందుల దుకాణానికి సంభావన సమర్పించే వెళతాము. అదీ పేమెంట్ ఫస్ట్, ట్రీట్మెంట్ నెక్స్ట్.

నా ప్రపంచంలో, దగ్గుతోపాటు, నేను విహరిస్తుండగా, ఆ ముందున్న పేషంట్ లేచి వెళ్ళిపోయారు. నన్ను రమ్మని, అక్కడ కూర్చోమని చెప్పి, బాబాయి నన్ను ఆయనకి పరిచయం చేశాడు. నాకున్న ప్రాబ్లమ్ చెప్పాను. ఆయన అంతా విన్నారు. నా చదువు, ఉద్యోగం లాంటివి తప్ప ఏమీ అడుగ లేదు. ఏదో చిన్న ఇంటర్వ్యూలా అనిపించింది.

ఇంతలో తన దగ్గరున్న చిన్న స్క్రిబ్లింగ్ పాడ్ లాంటి కాగితం మీద ఓకే ఒక పదం వ్రాసి, దాని క్రింద ప్రొద్దున్న ఒకటి రాత్రికి ఒకటి అని మార్క్ చేసి నా చేతికిచ్చారు. అసలు ఈయన నా సమస్య ఏమిటో వినే మందు వ్రాశారా? పైగా, ఒకేఒక మాత్ర. సందేహం సన్నగా పెద్దదవనారంభించింది. ఆ ప్రశ్నార్ధక ఎక్స్ప్రెషన్ తోనే అడిగాను “ఫీజెంత డాక్టర్?” అని. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చిరుమందహాసంతో “రెండు రూపాయలు” ఆన్నారు ఆయన. ఇది ఇంకో ట్విస్ట్.

ఒక పక్కన సందేహాలు. మరో పక్క నా మనసులో ఆయనపై పెరిగిన తెలియని గౌరవం. రెండు రైళ్ళు స్పీడ్ గా క్రాస్ చేస్తున్నట్టు ఈ ఆలోచనలు నా మనసులో పరిగెడుతూ ఉండగానే, నా జేబులో ఉన్న డబ్బులన్ని తీశాను. నా దగ్గర ఉన్న అతి చిన్న నోటు పది రూపాయలు. అదో రకమైన గిల్టీ ఫీలింగ్ తో ఆ నోటు ఆయన చేతికి ఇచ్చాను. అదే మందహాసంతో ఆయన తన ఎడమచేతి వైపునున్న చిల్లర కుప్పలోంచి జాగ్రత్తగా నాలుగు రెండు రూపాయల బిళ్ళలు తీసి నా చేతికి ఇచ్చారు. అవి పుచ్చుకుని, ఆయనకు థాంక్స్ చెప్పి ఇవతల ఉన్న మందుల దుకాణంలో ఆ చీటీ చూపస్తే, నా చేతికి ఆరు బిళ్ళలిచ్చి, నలభై రెండు రూపాయలు ఇమ్మన్నారు. ఇచ్చాను. అంటే … డాక్టర్ ఫీజు రెండు రూపాయలు, మందుల ఖరీదు నలభై రెండు రూపాయలన్నమాట!

గబుక్కున వెనక్కి వెళ్ళి, “ఒక చిన్న సందేహం” అన్నాను. “అడగండి” అన్నారు ఆయన. “హాల్స్ బిళ్ళ వేసుకుంటే కాసేపు ఉపశమనం అనిపించింది. అవి అలా తినచ్చునా?” అని అడిగాను. “వాటివల్ల మీకు లాభమూ లేదు, నష్టమూ లేదు. తయారు చేసే కంపెనీకి మాత్రం మంచి లాభం” అన్నారు.

అయితే, ఇక్కడ కొన్ని విషయాలు గమనార్హం. ఆ రోజు మధ్యాహ్నం వేసుకున్న ఒక్క డోస్ తోటే చాలా మటుకు దగ్గు కంట్రోల్ అయింది. ఆయన, మెడలో ఉన్న స్టెతస్కోప్ తియ్య లేదు, వాడ లేదు. కనీసం నాడి కూడ పట్టుకుని చూడ లేదు. కానీ, మనిషిని చూసి ఉన్న ప్రాబ్లమ్ గ్రహించి మందిచ్చే వైద్యుణ్ణి నేనిదే చూడడం. ఇదేనేమో, “వైద్యుడు” అంటే!

అంతేగాక, ఒక బల్ల, రెండు కుర్చీలు, ఒక బెంచ్, ఒక పెన్, ఒక స్క్రిబ్లింగ్ పాడ్ మరియు ఒక కుప్ప రూపాయి, రెండు రూపాయల బిళ్ళలు … ఆ ఓపెన్ వరండాలో ఇదే ఆయన క్లినిక్!

ఆ రెండు రూపాయలు మాత్రం ఎందుకు, ఉచిత వైద్యం చెయ్యచ్చుగా … అని అడిగే నాగరికులూ లేకపోలేదు. అది ఆయన సంపాదన మాత్రం కాదని వేరే చెప్పాలా? కాకపోతే, ఆ వెల కట్టలేని వైద్యానికి కొంచమైనా విలువ ఇవ్వాలి కదా!

తరువాత, వేనోళ్ళ విన్నాను ఆయన వైద్య సేవా నిరతి. ధన్యోస్మి! 🙏🙏🙏

(సశేషం)

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

In Memoriam My Nephew


Dear Vyas
What was that loss
You could share with none of us
Left all of us in an eternal maze?

Your mother awaits you, father longs for you
Unending recalled memories are in the queue
Your Sheldon wags and waits
Nobody is okay — if you watch these traits.

They say, “All critics are readymade”
You proved it your way — the road you rode
Having taken all such pains,
Who did you think should reap all gains?

To convey what sense
Have you left yourself in such a past tense?
To grab what future
Did you leave this silent gesture?

For what destination did you reach this destiny?
Any alien force could have been so tiny
Had you shared, had you shared
Had you shared, had you shared …

Your house is half-baked
Our throats are full-choked
For once, rise like a phoenix
And deny the fact and break this jinx!

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


తే.

బాధపెట్టు వత్సరముల పారదోలి
బీడు భూమికి చినుకుల పిలుపువోలె
వచ్చిపలికె నేటి యుగాది వరమువోలె
“శుభము, శుభ కృతుల శుభకృత్ శుభము గాగ!”

సరదా పద్యాలు (Updated)

తే. 
జడను మరల వేయనియట్టి జాణడతడు
దురదనోర్వగ లేకనే దువ్వ కుండ
గరళ కంఠుడు తేటల గంగ నీరు
జుట్టు ముడిలోన యుంచుట చుండ్రు మహిమ!

(PS: ఈ పద్యానికి సుమారు ముప్పై ఏళ్ళు. కాళ్ళకూరి నారాయణరావు గారి “వర విక్రయం” అనే నాటకంలో వరకట్నం ఇచ్చుకోలేకనే త్రిమూర్తులు ‘కూతులం గనుటయె మాన్కొనిరి’ అని చమత్కరించిన సందర్భములో నుండి నాకు ఈ ఆలోచన వచ్చింది.)

ఆ.
కోతి మూతి కోతి; కోతికి మూతియె
కోతి జాతి మూతి కోతి మూతి;
కోతి కోతికున్న కోటి కోతి కథల
మూతి కోతి, మూతి కోతి మూతి!

(PS: ఈ పద్యానికి సుమారు పాతికేళ్ళు. తెనాలి రామలింగడి “మేక తోక …” అనే పద్యంలో నుండి స్ఫురించిన ఆలోచన ఇది.)

ఆ.
వేచి వేచి చూడ వేసవి వచ్చేయు
కాల్సు ఎన్ని చేయ కలదె ఫలము?
నాదు టికెటు యేది నారపురాజుల?
రైళ్ళు వెళ్ళి పోయె రైయ్యి మనుచు!

(PS: Just for fun, ఇప్పుడే వ్రాశాను. నారపురాజు సాయి వంశీ దీపక్ ఇంకా విజయవాడ టికెట్ పంపనందున. 😃 -11.42 am … 22.02.2023)

కం.
వారము మారును; మాసము,
తారలు, హోరలు, తిథులును తప్పక మారున్;
మారును యుగాది వ్యవధి
తీరగ; కలుగునె జనులకు తీరిక తమకై? (20.03.2023)

ఆ.
గుర్రు మనుచు జనులు గురకలు పెట్టగ
రైలు దీసె పరుగు రైయ్యి మనుచు
గురక వినెడి వారి గోడిక మనకేల
విశ్వమంత గురువు వినుడు వినుడు!        (20.12.2023 … 4.35 am)

(సశేషం)

Rim Jhim Rim Jhim Hyderabad …

From the Telugu song “Rim jhim rim jhim hyderabad…” of a mid 20th century film to “Chal chal chal chal mere sathi, hum ban gaye hyderabadi…” of another in this decade, Hyderabad has attracted people from various regions into its open closet. People have settled here for generations and the newer look it is getting every decade is luring more and more settlers and denizens in addition to thousands of tourists every year. We all want to live in Hyderabad!

From the irresistible Irani Chai to Hyderabadi Dum Biryani, from Chudi Bazaars to newly coming up malls, star hotels and parks, the Pearl City has been widening itself to accommodate more and more people. Tourist spots, city travel by rail and road, theatre complexes, places of worship for every religion, roadside eateries, festivities, traditional celebrations, etc., are all marked by big big big pomp and show with the participation of a typical hyderabadi mindset. We all want Hyderabadi khel aur khaanaa!

Hyderabadis are both traditional and modern and their lives have two sides – both public and private. It’s only a hyderabadi who knows how to devour privacy in a buzzing public transport – RTC bus or local train. At the same time they have no complaints in respecting elders and handicapped people in such transport because the ‘buzurg’ takes no time for blessing the young and the blessed become ecstatic whenever recollected. We all want Hyderabadi khaandaan!

Hyderabad gives the aroma of Spring, Summer, Autumn and Winter. Just as various seasons, so are the various religions and their customs. Everyone knows every festival. Everyone knows how to revere and how to savour the festive seasons. We all want Hyderabadi Mousam!

Telugu, Urdu, Hindi, English, Tinglish, Hinglish, Minglish, Binglish, Ginglish, Anguish, Traffic rush, Gauche and Josh are all available in a splash! Any person, any region, any nationality – khaana, peena, sona, khelna, ghoomna or jhoomna – sab bandobast ho jayega! Kyon ki, we all want Hyderabadi Zindagi. Sirf Hyderabadi!

Let Hyderabad change; but only for enriching all our lives!

PS: I drafted this little write up on the 17th of December 2009 when 434 — my UG classmate — asked me for a short article about life in Hyderabad … for his website. While I still await his reply, I still relish the expression on Bala’s (my colleague at that time) face when he read it and appreciated me for penning this in about half hour. Yet, no regrets. I thank my classmate.

Yummy Injections

We all know how painful it is when our doctors prescribe injections as medicine. Tears roll down our cheeks at the sight of the syringe. So, if I were to get magical powers, I would cast my magical spell on all syringes in the world. With this, every injection will leave the flavours of our favourite foods in our mouths instead of pain. As we all children like chocolates, we will now run for the yummy injections, and thankfully our parents will now think of restricting injections. Isn’t it good … we will have no pain and doctors no strain! 😀 But remember friends, the flavours last only for five minutes because anything excess is never good!

PS. I wrote this for my elder one when he was asked to write something on “what will you do if you have magical powers?” while he was in his first standard. It’s so relishing recollecting the kids’ childhood.

(తెలుగు పాట) 2. కొత్త పెళ్ళి కూతురు

ఊ అనదు, ఆ అనదు, ఎట్టాగోరా వేగేది
కదలదురా, మెదలదురా, తలకాయైనా ఊపదురా … 2

పెనిమిటి అంటే ప్రేమేగానీ ప్రణయావేశం చూపదురా
రమ్మంటే, వచ్చిందంటే గజ్జల సవ్వడె సర్వమురా
తెలుపక తెలుపును తన మది నాకు అంతో ఇంతో చికాకులయ్యాక

ఊ అనదు ఆ అనదు … 1

ఊహుంది, ఆలోచనుంది, అంతకు మించిన కోరిక ఉంది
కల ఉంది, మెలకువ ఉంది, చెలి చేతులలో పనితనముంది
అడిగియె చెప్పుట నా వంతగును, చెప్పక చేయుట తన వంతగును

ఊ అనదు ఆ అనదు … 2



8.50pm, 14th December 2000

PS.
పాఠకులకు విజ్ఞప్తి: ప్రస్తుత తరానికి ఈ పాట అప్రస్తుతంగా అనిపించ వచ్చు. అది వారి పెంపకం, వారు పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. జావళీలా సాగే పాట “జిగి బిగి” లా కాక “గజిబిజి” గా అనిపించ వచ్చు. వారికి బాపూ గారి సినిమాలు, ఆయన సినిమాలోని పాటలు తరచూ చూపించ ప్రార్ధన!
                 ——******——
👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the comments box seen below.

(EP) 7. Dr. Ramanand’s Wedding Bells🔔 🔔

Dr. Ramanand’s wedding bells 🔔 🔔 were awesome 
The wedding’s conviviality was fulsome
The celebrations peaked with dance and blare
What else, none could ask any more!

The reception, the perception, the preception
Had an instantaneous convergent adaptation
The rise of spontaneous josh and fizzer
What else, none could be wiser!

The lyrics rendered by the near and dear
The witty bantering that was subtly clear
Impressions registered down memory lane
What else, leaving everyone on cloud nine!

They say, “Marriages are made in Heaven”
Undeniably, the Venue is that Sanctum, a Haven
The lovely couple were brimming with cheers
What else, “God bless them,” sang the angels’ lyres!

Let’s shower dua on the doctor-duo
With the indigenous wish “jugg jugg jio”
While the bride is married into Chilukuri
What else, the groom into Dharmapuri!

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the comments box seen below.

(EP) 5. It’s All New!

Teachers are new
Friends are new
Books are new
Lessons are new
Everybody says, I am also new,
1st to 2nd class; “Is it true?”🤔

I still want to play and play
With my same old toys and clay
Somebody tell everybody
Or ask my Teddy and Noddy!😌

(8am, 23.06.2008)



PS:

I wrote this short poem to depict the feelings of my elder fellow when he came to know that there will be shuffling of their class sections as they go from first class to second class.🙂

(TP) 3. తేడా

ఒక పక్షి గూడు కట్టి, గుడ్లు పెట్టి,
వాటిని పొదిగి, తిరిగి తిరిగి
తెచ్చిన తిండి ఆప్యాయముగా
తన పిల్లల నోట జాగరూకతతో వేయును;
పిల్లల ఆకలి తీరు వరకు అలసటకోర్చి చేయును,
వాటికి రెక్కలొచ్చి ఎగురు వరకు.
ఇది ప్రకృతి సిద్ధము.

ఒక భుజంగము కట్టియున్న పుట్టలో చేరును.
గుడ్లు పెట్టి, వాటిని పొదిగి,
సాకుటకై జూచును. కానీ,
తన ఆకలికి పెద్ద పీట వేసి,
తానే భుజించును.
ఇది ప్రకృతి వైపరీత్యము.

కానీ, ఇవి రెండూ ఒకే గర్భమున
జనియింపకుండ జూచు దైవము
మనిషినేల కనికరింపడు?

Grammar, Grammar, Would You Please Teach Us? (A Lyric)

We’re plus two students, Sir
We come from HPS
We heard about you and came to you to learn from you
Grammar, grammar, would you please teach us? ... (This line should be repeated)

Parts of Speech are eight in number, can you say what they are?
Noun, Adjective, Pronoun, Adverb, Verb and Conjunction.
What about the other two, you didn’t mention them?
The other two are Preposition and Interjection, Sir
Grammar, grammar, would you please teach us? ... (This line should be repeated)

A sentence can be divided into Subject and Predicate
The doer is the Subject and Predicate should have a Verb
The other way to divide it is Phrases and Clauses
While the Phrase has no finite verb a Clause should have one

Grammar, grammar, would you please teach us? ... (This line should be repeated)
PS. 
In 1995, we were asked by Prof. Balagopal to write an assignment (part of Media Tutorial), a song, that should be helpful for +2 students. This was part of our PGDTE programme in EFLU (formerly known as CIEFL). I had no idea how to do that for six days out of the one week we were given. On day six, when I was returning home by bus, the gentle breeze near the window seat reminded me of AR Rahman’s HAMMA HAMMA tune in the movie Bombay. Well, this is a Song I wrote for that tune.

When submitted, our professor asked each one of us to sing the songs we wrote. This is another shock! When my turn came, I just closed my eyes and sang it. When I opened my eyes, I saw our professor put the marks sheet before me and asked me to put the score I wanted!😀

More surprising was my joining in HPS and working there for a few years!😊

7. అసలే కోతి …

అసలే కోతి. అది కల్లు త్రాగినది. దానికి ముల్లు గుచ్చుకున్నది. అది సరిపోదనునట్టు నిప్పులు త్రొక్కినదట. ఇంక చెప్పుటకు ఏముండును. అంతా విదితమే గద!

ఇటువంటి పరిస్థితులు మనవంటి మానవులకు వచ్చిన యెడల, వాటినేమందురు? సినిమా కష్టములు అందురు. అది అటుయుంచిన, ఈ రకమైన గంపెడు కష్టములు ఎవరికి వచ్చును? ఇది అతిశయోక్తి మాత్రమే సుమా అని వాదించు వారు కూడ మెండుగ నుందురు.

ఒకపరి చిదానందమునకు రొంప చేసినది. ముక్కునుండి రెండు జీవ నదులూ పారుచుండెను. కర్చు లేనివి గనుక తుమ్ముల ప్రవాహము కూడ వరద వలె నుండెను. వీటిని అరి కట్టుటకు ఆతడు మరిగిన నీటిలో పసుపు మరియు ఈక్రిశాలి తైలము వేసి తాను కండువాతో ముసుగేసుకుని ఆవిరి పట్టుటకుపక్రమించెను. అంతలో ఉప్పెనవలె తుమ్ము వచ్చెను. ఆ ఊపులో ముక్కు వేడి నీళ్ళలో ములిగెను. ఆతడు స్నానాల గది వైపు పరుగులు తీసి కుళాయి త్రిప్పజూడ పైనున్న షవరు నుండి వేడి నీరు జాలువారెను. అది తప్పించుకొనుటకు ముందుకు జరుగగా కుళాయి ఆతని నుదుటన పాత రూపాయి బిళ్ళంత బొప్పి నిచ్చెను. అది కట్టివైచి చల్లటి నీరు చెంబు నిండా పట్టి ముక్కును ఆ నీటిలో పెట్టి హాయిగా ఊపిరి పీల్చెను. ఇంతకంటె ఏమగును? ముక్కులోకి సరిపడినంత నీరు దూరెను. ఇక ఆతడి పరిస్థితి వర్ణనాతీతము గాదె? కోతి పరిస్థితికి ఏమాత్రమూ తీసిపోదు గద.

వారము రోజులు గడిచెను. రొంప తగ్గినది. బొప్పి అణిగినది. కాలిన ముక్కు మీద మచ్చ మటుకు పూర్తిగా మానలేదు. ఆతడు తన భార్య కడకు పోయి అది ఎటుల పోవునని అడిగినంత, తన భార్య తాను వింటున్న “అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం …” అను ఘంటసాల పాట వచ్చు హెడ్ఫోన్స్ తన పెనిమిటి చెవులకు అమర్చి, ఆతడిని కనులు మూసుకొనుమని, కొంచెము వెన్నతెచ్చి ఆ మచ్చపై అద్ది నొప్పి కలుగకుండునటుల జాగరూకతతో సగము వచ్చియున్న పెచ్చును తీసివేసి సున్నితముగ శుభ్రము చేసి, అద్దము ఆతని ముందరనుంచి చూడుమని, “మీకు మచ్చా? ఆ మామకు గాదె?” అనినంత చిదానందం ఆనందభరితుడాయె. తన భార్య ఇచ్చిన ఈ అనుభూతి ఆతని మనసుకి హత్తుకుపోయను.

కానీ, సామెతలు ఊరక పుట్టవు గదా! మరి చిదానందమునకు ఆ కోతి సామెత జ్ఞప్తికి వచ్చి, పెద్ద బాలశిక్ష , చిన్న బాలశిక్ష, గూగుల్, వికీపీడియా వంటి వన్నీ వెతికినా తన భార్య తన మచ్చ తీసేసినట్టు, ఆ కోతి కాలులో ముల్లెవరు తీసినారో తెలియకుండెను! అయినను శాఖాచంక్రమణము చేయు తోకరాయునకు సపర్యలెవరు చేతురని ఊరకుండెను.

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(తెలుగు పాట) 1. ఓసోసి కోయిలా …

ఓసోసి కోయిలా ఓ పాట పాడవే
ఆ చెట్టు కొమ్మలో ఉయ్యాలలూగవే ...2

కీట్స్‌కి మత్తెక్కె నైటింగేల్ పాట విని
షెల్లి కరిగిపోయే స్కైలార్క్ పాటలోనే
ఈ ఆంధ్రదేశంలో నీకెవరె పోటీ
తీయగా పాడవే, తేనెవై కురవవే

ఓసోసి కోయిలా ఓ పాట పాడవే ...1

నీ నోటి పాటకై వడ్స్‌వర్తే వగచే
స్కైలార్క్ పాటలో ఈ జగతినే మరిచే
ఆపాటి నువ్వు కాదా, ఓ పాట పాడ రాదా
నా హృదయ వేదన నీవైన తీర్చ రాదా!

ఓసోసి కోయిలా ఓ పాట పాడవే ...2


PS. This is one of the very few lyrics I attempted to write about a couple of decades ago. In fact, I tuned it and taught my elder fellow to sing in his school competition when he was five. He sang very well until I went before him to take a snap towards the closing of the song when he looked at me, smiled and stopped singing. Well, his smile that I recall even today is more than the first prize. 😃
——******——
👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the comments box seen below.

6. బరువు — బాధ్యత

చిదానందం బావ ఇచ్చిన ఆ కవరు తీసుకుని అక్క మా ఇంటికి వచ్చింది. దాని గోల భరించలేక అది పుచ్చుకుని బ్యాంకుకి వెళ్ళి తిరుగు టపాలో తిరిగొచ్చాను. నా కోసం ఇంటి దగ్గర అమ్మ, అక్క ఎదురు చూస్తున్నారు. లోపలికి అడుగు పెట్టగానే ‘పని అయిందా’ అన్నట్టు నా కళ్ళల్లోకి చూసింది అక్క. దాని బాధ చూడలేక పోయినా, నిజం కూడా దాచ లేనుగా. ఏమి మాట్లాడాలో తోచక ఆ కవరు మళ్ళీ దాని చేతికి ఇచ్చేశాను. అది సైగతో అడిగిన ప్రశ్నకి పని అవలేదని నేను కూడా సైగతోనే సమాధానమిచ్చాను. అంతకుమించి ఏమి చెప్పగలను? అది ఏడుపు మొహం పెట్టి మూతి ముడుచుకుని కూర్చుంది.

“వాళ్ళు ఏమన్నారు?” అని అడిగింది అక్క. “ఇవన్నీ చూడాలంటే టైం పడుతుంది. మధ్యాహ్నం మూడింటికి రమ్మన్నారు” అని చెప్పాను. “మరి ఇంటికెప్పుడు వెళ్ళను? వంటెప్పుడు చెయ్యను?” అంటూ నసుక్కుంది అక్క. పని అవకపోవడంతో అక్క కోపం అంతా బావ మీదకి తిప్పి చిర్రుబుర్రులాడడం మొదలు పెట్టింది. ఇంతలో అమ్మ వంటింటిలోనుండి బయటికి వచ్చింది. అక్క మాటలు అమ్మ చెవిన పడడంతో “చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని తాతగారు ఎప్పుడూ అంటూనే ఉంటారు గదా. మర్చిపోయావా? నువ్వు చేసిన దానికేగా ఇదంతా? మరి అల్లుడి మీదెంకు అంత కోపం?” అంది. అంతే, అగ్గికి ఆజ్యం తోడయింది. అక్క కోపం రెట్టింపయింది.

ఇదంతా జరుగుతుండగా పనిమీద బయటికి వెళ్ళిన నాన్న తిరిగొచ్చారు. “అరె, నువ్వెప్పుడొచ్చావు?” అని అడుగుదామనుకున్నట్టున్నారు. కానీ, అక్క మొహం చూడగానే “ఏం జరిగింది? వాట్స్‌ ద ప్రాబ్లం?” అని అడిగారు. అక్క, ఇంకోసారి ఏడుపు మొహం పెట్టి ఆ కవరుకేసి చూసింది. “ఈ కవరేంటి?” అంటూ నాన్న దాన్ని చేతిలోకి తీసుకుని అందులోకి చూశారు. “ఇదేంటి ఈ నోట్లన్నీ ఇలా ఉన్నాయి? కొన్ని చిరిగి పోయాయి. కొన్ని డస్ట్‌బిన్‌లో నలిపి పారేస్తే ఏరుకొచ్చినట్టున్నాయి. ఇవి తడిసిపోయి అతుక్కుపోయాయి. ఇదేంటి, వీటినిండా నూనె మరకలు? అరె, ఈ కాయిన్స్‌ ఇలా వంకర్లుపోయాయేంటి? అసలు ఇవన్నీ నీకెక్కడ దొరికాయే?” అని అడిగారు. ఇంక అక్క గారాలు పోతూ ఏడుపు మొదలెట్టింది. “విషయం చెప్పి మరీ ఏడు” అంటూనే నాన్నకి బీపీ పెరగడం మొదలెట్టింది. “నేను తెచ్చుకోవడమేంటి నాన్న? అవి ఈ నెల ఇంటి కర్చులకి ఆయనిచ్చిన డబ్బులు” అంటూ బోరుమంది.

“ఇవి ఎవడు తీసుకుంటాడు? బ్యాంక్ వాళ్ళు కూడా మార్చివ్వరేమో? అయినా, ఇలాంటివన్నీ అతనికి ఎక్కడ దొరికాయి? ఇవి ఎలా కర్చు పెడతావనుకున్నాడు? అయినా పెళ్ళై ఇన్నేళ్ళైన తరువాత ఇదేం పరిహాసం?” అంటుంన్న నాన్న కోపం హెచ్చవడంతో, “నువ్వు కూడా ఇలాగే చెయ్యి. పప్పులో ఉప్పెక్కువెయ్యి. కూరల్లో కారం పోసేయ్. సాంబార్‌లో పోపెయ్యకు. కూరలేవీ పూర్తిగా ఉడకనివ్వకు. వేపుళ్ళు మాడ్చి పారేయ్. పచ్చళ్ళు అస్సలు నలగనివ్వకు. కఫీ, టీలు ఇవ్వడం మానేసేయ్. స్వీట్లు, హాట్లు జాన్తానై అని చెప్పు …” ఇలా అక్కని రెచ్చగొట్టడం మొదలెట్టారు. అక్క ఏడుపు సౌండ్ కూడా పెరిగింది.

ఇంతలో అమ్మ కలుగ జేసుకుని, “చాల్లేండి బగానే ఉంది మీ తండ్రీకూతుళ్ళ సౌడుభ్యం. ఎవరయినా వింటే నవ్వి పోతారు. చేతనైతే సరిదిద్దండి లేకపోతే ఊరుకోండి. అంతేగానీ, దాన్ని అతనికి వ్యతిరేకంగా రెచ్చగొడతారెందుకు? అది ఇక్కడే తిష్టేస్తే? అసలు నిజంమేటో తెలుసుకోకుండా ఏమిటా ఆవేశం? అక్షరాలా మీరిప్పుడు చెప్పినట్టే మనమ్మాయి వంటచేసేది. ఇదేమన్నా చిదంబర రహస్యమా? ఇవి కర్చుపెట్టం ఎంత కష్టమో అది చేసే వంటకాలు తినడం కూడా అంత కష్టమని చెప్పకనే చెబుతున్నాడని తెలియడంలేదా? … అతనికేమో రుచులు కావాలి, మీ గారాల కూతురుకి తను ఏది చేస్తే దాన్నే షడ్రసోపేతంగా భావించి పొగడ్తలలో ముంచెత్తాలనుకుంటుంది. ఇందులో ఏది మారాలి? అల్లుడికి కావలసిన రుచులా లేక మన అమ్మాయి వంటతీరా? మీరే ఆలోచించండి.” అంది.

అమ్మ మాట్లాడిన మాటలకి నాన్న, అక్క నోళ్ళెండబెట్టారు. “అది వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరాకా అల్లుడు ఫొన్ చేశాడు. ఇది మనకి కొత్తేమీ కాదుగా? మన అమ్మాయికి వంటైనా నేర్పించాలట లేదా మన మకాం వాళ్ళింటికి మార్చి దాని చేతి వంటే మనం కూడా రోజూ మూడు పూటలూ రుచి చూడాలిట. వెళ్ళి అక్కడే ఉందామా?” అంది అమ్మ. నాన్న, అక్క ఎండబెట్టిన నోళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. “పిల్లలు ఎంతసేపూ బైయటికి వెళ్ళి తినొద్దామని గోలట. మరి ఎదిగే పిల్లలకి రుచులు కూడా కావాలిగా! … ఇందాక మీరు చెప్పినట్టే మీకు చేసి పెట్టనా రోజూ? … సంబంధం చూసేటప్పుడు మనవాళ్ళేనా, కుర్రాడు ప్రయోజకుడా, బుధ్దమంతుడేనా, స్థిరమైన ఉద్యోగం ఉందా, కుటుంబం ఎలాంటిది … లాంటివి కాకుండా ఏ కోటీశ్వరుడినో చూసి కట్టబెట్టేసుంటే సరిపోయేదిగా? పది మంది నౌకర్లు ఉండేవాళ్ళు, ఈ వంట గోల తప్పేది … రుచిగా వంట చేయడం ఒక బాధ్యత అని ఇంకా దానికి చెప్పవలసి రావడం మన ప్రయోజకత్వమేగా? … సరేలేండి, వాళ్ళకి సరిపడ కూడా వంట చేశాను. నేను దానితో వెళ్ళి అతనిని సమాధానపరచి వద్దామనుకుంటున్నాను.” అంటూ నన్ను కారు తీయమంది అమ్మ.

నేను కారు తీసి బయట పట్టేంతలో అమ్మ అక్కని లోపలికి తీసుకెళ్ళి ఏమి చెప్పిందో తెలియదు కానీ, బయటికి వస్తూ అక్క “ఇంకొక సారి నా సంసారం గురించి నేనే చూసుకుంటాను అమ్మ. ఇంకెప్పుడు మా విషయాలు మీ దాకా తీసుకు రాను” అంటూ తను తెచ్చిన కవరు, అమ్మ ఇచ్చిన సంచి తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ బయలుదేరి వెళ్ళింది.

ఇంతలో అంత మార్పు ఎక్కడి నుండి వచ్చిందో నాకు, నాన్నకు అర్థం కాలేదు. కుతూహలం ఆపుకోలేక వెళ్ళి అమ్మని “హౌ?” అని అడిగాను. “ఆ … ఎప్పుడో చెయ్యవలసిన పని ఇప్పటికి చెయ్యగలిగాను. అది అక్కడ బాధ్యత వదిలేసి వస్తే, ఇక్కడ బరువే కదా? వెనకటకి ఓ భీమవరం రాజు గారు కూతుళ్ళకి ఊళ్ళో సంబంధాలు చేయ కూడదు అంటే ఏమిటా అనుకున్నాను” అంది అమ్మ చెప్పుకోలేని భావనతో.

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

5. ఆర్యవర్ధన్

“Oh, I see a different interpretation to this Shakespearean text” అన్నారు మా గురువుగారు ఒకింత ఆవేశంగా. అది పాతికేళ్ళ క్రితం. ఆయన ముఖంలోని ఆ ఆశ్చర్యం నేను ఇప్పటికీ మరచిపోలేను. అప్పుడు ఆయన మాకు ‘హామ్లెట్’ చెబుతున్నారు. ఆ ఏడాదిలో ఆయన రిటైర్ అవుతున్నారు. మరి ముప్ఫైమూడేళ్ళు పాఠం చెప్పారు కదా, ఇప్పుడు అదే టెక్స్‌ట్‌లో కొత్తదనమేమిటా అనిపించింది. తలచుకుంటే ఇప్పటికీ ఆ ఆశ్చర్యం అలాగే అనుభవంలోకి వస్తోంది. ఎందుకంటే, షేక్స్పియర్ నాటకాలు చదివిన కొద్ది క్రొత్తదనం చూపుతాయి; మరి మా గురువుగారు క్రొత్తదనం కోసం తరచి తరచి చూస్తారు. కాబట్టి, ఆ ఇద్దరూ గొప్పవారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు: ఆయనకి షేక్స్పియర్ గొప్ప; మాకు మా గురువుగారు గొప్ప!

ఈ సందర్భంలో, మాకు పదవ తరగతిలో తెలుగు, అంతకు మునుపు, క్రింద తరగతులలో సంస్కృతము చెప్పిన గురువుగారు, వేదుల వెంకట రావు గారు గుర్తుకు రాక తప్పదు. మాకు, ‘ఆంధ్రమహాభారతము’ లో తిక్కన రచించిన ఉద్యోగ పర్వం తృతీయాశ్వసం నుండి తీసుకున్న కొన్ని పద్యాలు ‘పాంచాలీ పరిదేవనము’ అనే పాఠ్యాంశముగా ఇచ్చారు. అందులో, కౌరవులతో రాయబారానికి వెళుతూ, శ్రీ కృష్ణుడు ద్రౌపదిని తను చెప్పేది ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు, ద్రౌపది తను ముడి వేయకుండా ఉంచిన తన కురులు చూపిస్తూ మాట్లాడడం మొదలు పెడుతుంది. పద్యంలో “ద్రోవది బంధురం బయిన క్రొమ్ముడి గ్రమ్మన విడ్చి వెండ్రుకల్ /దా వలచేత బూని …” అని వస్తుంది. దీన్ని మాష్టారు, ‘ద్రౌపది తన జుట్టు కుడి చేతులో పట్టుకుని’ అని వివరించారట మా సీనియర్లకి. కానీ, మా పుస్తకంలో ఇచ్చిన బొమ్మలో ద్రౌపది తన జుట్టు ఎడమ చేతిలో పట్టుకున్నట్లు చూపించారు. అయితే, మునికుమార్ అనే కుర్రవాడు ఆ బొమ్మ చూపించి “ద్రౌపది ఏ చేతిలో తన జుట్టు పట్టుకుని శ్రీ కృష్ణుడికి చూపింది?” అని అడిగాడట. దానికోసం ఆయన తిక్కన వ్రాసిన పుస్తకాన్ని ఒకసారి తిరగేసి ఆ బొమ్మ తప్పుగా చూపిస్తోందని మర్నాడు వివరణ ఇచ్చారట. ఈ పద్యం మాకు చెబుతూ తనను ఈ సందర్భం మళ్ళీ ఆలోచింపజేసింది అని గుర్తు చేసుకున్నారు, ఖద్దరు తప్ప ఏదీ కట్టని ఆ డెభ్భై ఏళ్ళ ఆజానుబాహుడు.

ఇలాంటి గురువుల దగ్గర చదువుకోవడం ఏ జన్మ సుకృతమో! గుడ్డలోంచి తీసేసిన తరువాత కూడా ఇంగువ వాసన గుడ్డని వదలనట్టు అనిపిస్తుంది! అలాంటిది గురువు యొక్క దర్శనం, అనుగ్రహం మార్జాల కిశోరంలా దొరికితేనో? జన్మ ధన్యమేగా!

అలాంటి సందర్భము నా జీవితంలో కూడా తారసిల్లింది.

గురువుగారిని చూసి వద్దామని మా రెండోవాడిని తీసుకుని వెళ్ళాను. గురు పత్నికి, తీసుకెళ్ళిన పళ్ళు అందించి, ఇద్దరం వారిరువురి ఆశీర్వాదం తీసుకున్నాము. కాసేపు ముచ్చటించిన తరువాత, ఆయన తను లామినేట్ చేయించిన ఒక ఫోటో నాకు ఇచ్చారు. అందులో శ్రీరామచంద్రుడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుంటున్నట్టు ఉంది. అందులో ఆంజనేయుని ముఖంలో ఉన్న ప్రశాంతత, కడుపునిండ పాలు త్రాగి తల్లి వడిలో హాయిగా నిదురిస్తున్న పాపడి లాగా అనిపించింది. ఇప్పటికి అలాగే అనిపిస్తుంది. ఆయన చేయించిన నాలుగు కాపీలలో అది ఒకటి. నన్ను మనసార హత్తుకుని ఆయన ఆ ఫోటోతోపాటు ఆయన ఆశీర్వచనం నాకు ఇచ్చారు. ఇంక నా ఆనందానికి అవధులుంటాయా!

తరువాత మా వాడు నాకు, మా గురువుగారికి ఒక ఫోటో తీశాడు. అప్పుడు, గురువుగారికి మరియు గురుపత్నికి ఒక ఫోటో తీయడానికి అంతా సెట్ చేశాను. ఇంతలో, గురువుగారు నన్ను ఆపి, “నీ ఇద్దరి కొడుకుల పేర్లలో ‘వర్ధన్’ అని వచ్చేట్టు పెట్టావు, మరి ఆ పదం కలిపి నాకేమి పేరు పెడతావు?” అన్నారు. కలర్ ఫోటో మాట దేముడెరుగు. ఉన్నట్టుండి నా బుర్రంత డార్క్ రూమ్ అయిపోయింది. ఆయనకి నేను పేరు పెట్టడమేంటి? ఆయన ద్విభాషా కోవిదులు. ఆయన పాండిత్యం ముందు నేనెంత? ఇది కలా, నిజమా? అసలు ఇదేం పరీక్ష? నోరు పెగల్లేదు. మనసులో అదొక రకమైన ఆందోళన. నా మిడి మిడి జ్ఞానంతో ఏదో చెప్పజూశాను. కానీ, ఆయనకి నచ్చలేదని ఆయన కళ్ళు చెప్పకనే చెప్పాయి.

సరే. ఫోటో సెషన్ అయ్యాక ఆయన దగ్గర సెలవ తీసుకుని ఇంటికి బయలుదేరానే గానీ సందర్భానుసారంగా మెలగ లేక పోవడమేంటి అని నా మీద నాకే కోపం వచ్చింది. దారిలో ఆలోచనలు మనసులో పరుగులు తీశాయి. ఇంతలో ఒక మంచి పేరు తట్టింది. అది మొదలు తప్పులు లేకుండా ఉండాలని ఆ పేరును అన్ని రకాలుగానూ చూశాను. ‘బాగుంది’ అనిపించింది. అదే “ఆర్యవర్ధన్”. ఆయన ద్వితీయ బాల్యంలో* ఆయనకి నేను నామకరణం చేయడం ఎంతో ధ్రిల్లింగా అనిపించింది. ఈ పేరు ఆయనకి తప్పక నచ్చుతుందనే ఆశతో ఈ కథ వ్రాసి ఆయనకి పంపుతున్నాను. దేనికైన భగవధేచ్ఛ ఉండాలి అంటాడు కదా జాన్ మిల్టన్ On Arriving at the Age of Twenty-three అనే Sonnetలో! వెంటనే కాకపోయినా, ఈ శీర్షిక రూపంలో ఆయన ప్రశ్నకు జవాబు ఇవ్వ గలుగుతున్నానన్న సంతృప్తి ఉంది కదా! పైపెచ్చు ఈ అవకాశం ఆయన ప్రోద్బలమేగా!

శ్రీ గురుభ్యో నమ:

*As You Like It అనే డ్రామాలో దీన్ని ‘Second Childhood’ అంటాడు షేక్స్పియర్. ఇది, మెలంకలి ఫిలాసఫర్‌ జాక్విస్ చెప్పిన ‘Seven Ages of Man’ అనే సందర్భంలో వస్తుంది.

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below.

(Hindi) 3. दाने दाने पे …

बादल गरजते हैं बरसते हैं
और नदियाँ बेहती हैं
सूरज रोशनी और गर्मी देता है
हवायें सांस देती हैं और ख़ुशबू लाती है
धरती फसल देती है
किसान खेती करता है उसकी रक्षा करता है
उसको काटता है हमें भेजता है
श्रामिक उसको हम तक पहुँचाता है
और दाने दाने पे लिखा हुआ है “खाने वाले” का नाम?
.
.
.
अगर कोई उस दाने को डाला गटर में, तो वो होगा कैसा काम और उस दाने पे होगा किसका नाम?

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the comments box seen below.

4. సమర్ధన — విచక్షణ

చిదానందం అనుకున్నట్లు ఆ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అయింది. అందరం ఇంటికి వచ్చేశాము. కాళ్ళ నొప్పులతో కూర్చున్న నాకు వాడు కాస్త కొబ్బరి నూనె రాసి మర్దనా చేశాడు. నిజానికి అలసి పోయింది వాడే. అన్ని వసతులు చేస్తే ఊరికే వెళ్ళి వచ్చే సరికే ఇంత అలసట. వయసు కదా మరి.

వాళ్ళ తాతయ్య కోరిక ప్రకారం వాడి షో అయింది. ఆయన తన మనవడికి వచ్చిన పేరు తనకే వచ్చినట్లు ఎంత పొంగి పోయారో. వాణ్ణి అలా కౌగలించుకుని కొద్ది సేపు ఆ స్టేజ్ మీద ఉన్నంత సేపూ హాల్లో కరతాళ ధ్వనులు ఆగలేదు. నా కళ్ళు చమర్చాయి. అలా బావని పట్టుకుని ఉండి పోయాను. అందులో నా వంతు నేనూ చేశాను కదా. ఈ ఇంటికి కోడలిగా వచ్చి, వారికి మనవణ్ణి, మా బావకి వారసుణ్ణి, ఈ ఇంటి పేరుకి, వారు ప్రాణంలా చూసుకునే కళకి తగిన వంశోద్ధారకుణ్ణి ఇవ్వగలిగాను కదా!

ఇప్పుడే కాళ్ళు కాస్త సర్దు కుంటున్నాయి. రేపటికి అంతా నార్మల్ అయిపోయి నా పనిలో నేను పడిపోవాలి. ఇలా కుదుట పడుతున్న మనసులో పలు ఆలోచనలు కూడా పరుగెత్తడం మొదలుపెట్టాయి. ఆ గదిలో మా మావయ్య తృప్తిగా నిద్ర పోతున్నారు. “మాష్టారు గారూ” అంటూ వచ్చి ఆయన చేత బొమ్మలు గీయించుకున్న వాళ్ళు ఎంత మందో. చెయ్యి కాగితం మీద పడితే చేతనత్వమే కదా! … “అలాంటి మనిషికి ఇలాంటి భార్యా?” అనిపిస్తుంది.

నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న రోజులవి. కాలేజీకి వైవా కోసం వెళ్ళాను. అది అయి బయటికి వచ్చేసరికి చాలా మబ్బుగా ఉంది. వచ్చి తీసుకుని వెళతానన్న నాన్న ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే మా ఇంటి దగ్గర కుంభవృష్టి అని తెలిసింది. ఆ ప్రక్కనే మా మేనత్త ఇల్లు. అక్కడికి వెళితే వర్షం తగ్గాక వచ్చి తీసుకెళతానన్నారు నాన్న. సరేనని వెళ్ళాను. అత్త చాలా సంతోషించింది. సాయంత్రం ఉల్లిపాయ పకోడీలు వేసి పెట్టింది. నా కోసం టమాటా సాస్ కూడా తెమ్మంది. మావయ్య కూడా ఇష్టంగానే తెచ్చిపెట్టినట్టు అనిపించింది.

చీకటి పడింది. ఇంతలో నాన్న అత్తకి ఫోన్ చేశారు. నాతో కూడా మాట్లాడారు. మా ఇంటి దగ్గర రోడ్డు మీద మోకాలు లోతు నీళ్ళు నిలిచిపోయాయి. వచ్చేందుకు కానీ వెళ్ళేందుకు కానీ వేరే దారి లేదు. అయిష్టంగానే నన్ను ఆరోజుకి మా అత్త ఇంట్లో ఉండమన్నారు నాన్న. నేనెప్పుడూ వాళ్ళ ఇంట్లో ఉండలేదు. సరే ఇంక తప్పదు కనక కాసేపు అత్తతో కబుర్లు చెప్పాక అత్త వంట మొదలెడితే నేను కూర తరిగిస్తానని వెళ్ళాను. “రాకరాక వచ్చావు. మీ అమ్మానాన్నలు నిన్నసలు పంపనే పంపరు.” అంటూ ఎమీ ముట్టుకోనీయ లేదు. కాసేపు టీవీ చూసి అలా మావయ్య ఆర్ట్ రూమ్ కేసి వెళ్ళాను. కొన్ని పేయింటింగ్స్ చూస్తే “భలేగా ఉన్నాయే” అనిపించింది. మావయ్య ఏదో ఆలోచిస్తూ నేను వచ్చింది గమనించి “రామ్మా. దా ఇలా కూర్చో” అన్నారు. బాబోయ్ ఎందుకు ఇటు వచ్చానా అని అనుకుంటూనే వెళ్ళి కూర్చున్నాను.

నన్ను కూర్చోమని అన్నారే కానీ మావయ్య ఏదో ఆలోచిస్తూ తను వేస్తున్న పెయింటింగ్ కేసి దీర్ఘంగా చూస్తున్నారు. “ఇక్కడ ఏ రంగు బాగ్రౌండ్ బావుంటుంది?” అని అడిగారు. “మేబీ … పింకిష్ ఆరంజ్?” అన్నాను ప్రశ్నార్ధకంగా. “యూ ఆర్ రైట్” అంటూ భలే ఆనంద పడిపోయి అదే రంగు వాడడం మొదలు పెట్టారు. “ఆయన పెయింటింగ్ కి నా సలహానా?” అనుకుంటూ నేను మెల్లిగా ఇవతలిక వచ్చేశాను. ఆయన తన రంగుల్లో ములిగి పోయారు.

ఇంతలో అత్త నాకు ఇష్టము అని చపాతి, పన్నీర్ కర్రి చేసి మా అందరికి పెట్టింది. అందరం తింటున్నాము. పెద్దగా మాట్లాడని మావయ్య “ఆ రంగు ఎందుకు సజెస్ట్ చేశావు?” అని అడిగారు. అంత సడన్ గా అడిగితే ఏంచెప్పాలో తోచలేదు. “అబ్బా … దాన్ని తిననివ్వకుండా ఏంటి మీ రంగుల గోల?” అంది అత్త కొంచం కసురుకున్నట్లు. అలాంటి పరిస్ధితి నేను ఎప్పుడు చూడలేదు. సమాధానం చెప్పాలా వద్దా … పెద్ద సందిగ్ధత. అక్క, నేను దెబ్బలాడుకునేడప్పుడు అమ్మ చెప్పే కప్ప—పాము సామెత గుర్తుకు వచ్చింది. మావయ్య ఏమీ అనలేక తలవంచుకుని తినడం మొదలు పెట్టారు. ఐ ఫెల్ట్ హీ ఇజ్ ఇన్ ఫాక్ట్ హామ్లెస్. రంగులంటే నాకూ ఇష్టం కాబట్టి కొంచెం ధైర్యం చేసి, అత్త అలా వంటింట్లోకి వెళ్ళగానే మావయ్యకేసి చూసి “నేను నా డ్రెసెస్ కొనేటప్పుడు కాంట్రాస్ట్ కోసం ఎలా చూస్తానో ఆ ఉద్దేశంతో చెప్పాను” అన్నాను. “ఊ … వెరీగుడ్. యుూ ఆర్ అబ్జర్వెంట్ …” అంటూ ఇంకా ఏదో చెప్పబోయి అత్త రావడం గమనించి ఆగి పోయారా అనిపించింది.

భోజనం తరువాత అత్త మావయ్యకి మజ్జిగ చేసి ఇచ్చింది. ఒక్క సారిగా తాగేయబోయి ఆగి పోయారు మావయ్య. ఇప్పటికీ తలుచుకుంటే వళ్ళు జలదరిస్తుంది. అందులో జీవచరాలు. మావయ్య అత్తకి చూపించారు. వెంటనే అత్త అరవడం మొదలు పెట్టింది. ఏనాడూ మావయ్య వంటింటిని పట్టించుకోలేదని, బాగు చేయించ లేదని, పెస్ట్ కంట్రోల్ కొట్టించ లేదని … అప్పుడు మజ్జిగలో ఏమైనా రావచ్చని … వగైరా, వగైరా!

… మావయ్య మారు మాట్లాడకుండా తన ఆర్ట్ రూమ్ లోకి వెళ్ళారు. అసలు వీళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానా అనిపించింది. కాకపోతే, అలా జరిగితే, అమ్మ వెంటనే నోరు కడుక్కోమనో లేక ఏదైనా వేరేది టేస్ట్ కోసం ఇవ్వడమో చేసేది అనిపించింది.

ఆ రోజు నేను అత్త వాళ్ళ గదిలో పడుకున్నాను. ఓ అరగంట తరువాత అత్త కూడా అక్కడ పడుకోవడానికి వచ్చింది. నేను పడుకున్నాను అనుకుని తనూ అలా వాలింది. ఇంతలో నాన్న ఫోన్ చేశారు. అత్త మాట్లాడుతూ ఉన్నట్లుండి ఏడుస్తూ గదిలోంచి బయటికి వెళ్ళింది. కొద్ది నిమిషాల్లో కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చి పడుకుంది. ఇదంతా చూసిన నాకు నిద్దర హూష్ కాకి అయిపోయింది. ఇది సరిపోదు అన్నట్లు మర్నాడు ప్రొద్దున్నే, నాన్న వాళ్ళ ఫ్రెన్డ్స్‌తో వచ్చి, అత్తని గది తలుపులు వేసి కాదు దమ్ముంటే తన ముందు కొట్టమని, భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకోమని అరిచి గోల చేసి, మావయ్యకి వార్నింగ్ ఇచ్చి నన్ను తీసుకుని వచ్చి కారులో బయలుదేరారు. “నాన్న, అసలు ఏమి జరిగింది అంటే …” అని అనేంతలో, “నాకు అన్నీ తెలుసు. నువ్వు చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ చూసిందంతా మరచిపో” అని గద్దించారు. నాకు నోట మాట పెగల్లేదు.

నా డిగ్రీ పూర్తి అయింది. నేను ఏదైనా ఫర్మ్ లో చేరటమో లేక ప్రాక్టీస్ మొదలు పెట్టడమో చేద్దాము అనుకున్నాను. కానీ అమ్మ పెళ్ళి ప్రస్థావన తెచ్చేసింది. నాన్న కూడా సై అన్నారు. ఒక గంటలో పెళ్ళికొడుకుల లిస్ట్ కూడా ముందుకు వచ్చేసింది. నా ఇష్టం ఎవరికీ పట్టలేదు అనిపించింది. అవతలికి వెళ్ళి అక్కకి నా మనసులో మాట చెప్పాను.

ఐదు నెలల తరువాత పదహారు రోజుల పండగ మా ఇంట్లోనే జరగాలని పట్టుబట్టింది అత్త. ఆ రోజు రాత్రి భోజనం చేశాక అత్త అందరికి మజ్జిగ ఇచ్చింది. ఈ సారి జీవచరాలు నాన్నని వరించాయి. అత్తని పక్కకి పిలిచి అడిగారు. అత్త షరా మామూలే అన్నట్లు మావయ్యని మాటలు అనడం మొదలెట్టింది. నాన్నకి నోట మాట రాలేదు. ఇదంతా అమ్మ కూడా చూస్తూనే ఉంది. మొహం మాడ్చుకున్నారు నాన్న, అత్త. వెంటనే బయలుదేరతామని అమ్మ, నాన్న లేచారు. బయట కార్‌లో కూర్చున్నాకా, నేను ఒకసారి మాట్లాడి వస్తానని బావకి సైగ చేస్తే అర్థం చేసుకుని లోపలికి వెళ్ళాడు.

అప్పుడు నేను నాన్నతో అన్నాను “ఏంటి నాన్న, మొహం అలా ఆముదం తాగినట్లు పెట్టావు? ఇదే విషయం నేను నీకు కొన్ని ఏళ్ళ క్రితం చెప్పబోతే ఇదే కార్ లో నన్ను నోరు మూసుకోమన్నావు? అందుకే గద ‘తనదాక వస్తే గానీ తెలియదు’ అన్నారు? ఇన్నాళ్ళు అత్త కోసం మావయ్యని తూలనాడావు. ఇప్పుడు నీ కూతురు కోసం నీ చెల్లెలినో నా భర్తనో తూలనాడుతావా? ఏ … నువ్వు అమ్మ మీద ఎన్నడూ చెయ్యి ఎత్తలేదా? అలాగే నీ బావమరుదులు నీ ఇంటికి వచ్చి గోల చేస్తే ఎలా ఉండేదో ఒక్క సారి ఆలోచించు? మందినేసుకుని వెళ్ళి మీద పడితే భయపడి కాపురం చేస్తున్నారు అనుకుంటున్నావా? అసలు నిజానికి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ఓపిక నీకెక్కడిది? … అక్క విషయంలో కూడా ఇంతేగా! పెళ్ళైన తరువాత, ఒకళ్ళనొకళ్శు అర్థం చేసుకోవడానికి రెండు మూడేళ్ళైనా పట్టదూ? ఆ టైమ్ వాళ్ళకి ఇచ్చారా మీరు? ఎన్ని ఏళ్ళు అయినా మీరు అనుకున్నట్లే మీ ఆడపిల్లలు సుఖపడాలి అనే మీ పిచ్చి ఉన్నంత కాలం మీరే వాళ్ళ సుఖాలకి అడ్డుగోడలు. ఏ … మీ అమ్మ మా అమ్మని ఎంత బాగా చూస్తోందో మన చుట్టాలు అందరికీ తెలియని విషయమా? … ఔను, బావకి ఏవో షరతులు పెట్టావట? అవి నాతో చెప్పకూడదు అన్నావుట? నాకూ, బావకి మధ్య నీ షరతులేంటి? నాకు అన్నీ పెళ్ళికి ముందే చెప్పాడు. బావ చదువుకున్న వాడు. బుద్ధిమంతుడు. కచ్చితంగా అవి మీ చెల్లెలి దగ్గర నుండి మాత్రం రాలేదు. అదీగాక, ఢిల్లీలో వచ్చిన ఆఫర్ తీసుకుని వీలైనంత తొందరగా అక్కడికి వెళ్ళిపోమన్నావుటగా? ఏమిటో ఈ చోద్యం? మీ ఇంట్లో పిల్లని చేసుకుంటే వేరే కాపురం పెట్టవలసిందేనా? … ఎనీహౌ, ఇప్పుడు ఇది నా ఇల్లు. ఇది నా సంసారం. కాబట్టి, అత్త సంసారంలోనూ, అక్క సంసారంలోనూ ఇంటర్ఫియర్ అయినట్లు నా సంసారంలో కూడా దూరవు అనుకుంటున్నాను. బై ద వే, నువ్వు వాళ్ళ మధ్య దూరి చేసిన మంచి ఏంటి? అత్త కోసం, అక్క కోసం పోరాడావా? ఏం సాధించాలాని? ఏం సాధించావు? అంతెందుకు వాళ్ళని నీ దగ్గరే ఉంచుకుంటే బాగా సుఖపడే వాళ్ళేమో? … ఇవాళైనా నిజం తెలిసింది అనుకుంటా. అయినా, అమ్మపుట్టిల్లుమేనమామకి తెలియదా అన్నట్లు, అత్త గురించి నీకు తెలియకపోతే కదా! ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పు; తమ్ముడికి పెళ్ళి చేద్దాము అనుకుంటున్నావు కదా, అత్తలాంటి పిల్లని ఇచ్చి చేస్తావా? … మరీ అలా నోరెండబెట్టకు. మాట వరుసకి అడిగాను, అంతే. ఎంతైనా వాడు నా తమ్ముడేగా! అయినా, అత్త చెడ్డది కాదు. ఈ వారం రోజుల నుండి గమనిస్తున్నాను కదా. తను చేయాలనుకుంటే తప్పకుండా చేసి పెడుతుంది. కాకపోతే, సోమరి. అదీగాక, ప్రతిదానికి తన అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతుంది. దానికి మించి మీరు పెంచి పోషించిన అహంకారం. సో, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఒక మనిషి కావాలి. అందు కోసం ప్రతి చిన్న విషయానికి మావయ్యని టార్గెట్ చేస్తుంది. “మొగుణ్ణి కొట్టి మోక్షానికి మెరెట్టింది” అన్నట్టు లేదూ? ఇంక ఎలా సుఖపడుతుంది? ప్రతి రోజూ నరకమేగా? అసలు నువ్వు ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే వాళ్ళ సంసారం కూడా చక్కగా ఉండేది. కాదా? … డోన్ట్ వర్రీ. నాకు కావలసినవి బావకి నెమ్మదిగా చెప్పి చేయించుకుంటా. కుదరకపోతే ఊరుకుంటా. కానీ, ఎవ్వరినీ మా కుటుంబ విషయాలలో తల దూర్చనివ్వను. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా? …

ఇప్పటికైనా ఆలోచించు. ఈ విషయం ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియ లేదు నాన్న.” … కోపంతో నాన్న కారు స్టార్ట్ చేశారు.

నాలో అంత ధైర్యాన్ని నింపిన అమ్మకి జోహార్లు. తల్లే కదా ఆడపిల్లకి సంసారాన్ని ఎలా నడుపుకోవాలో, ఎలా నిలుపుకోవాలో చెప్పవలసిన మనిషి! ఇప్పటికీ అదే కరక్ట్ అనిపిస్తుంది. ప్రతి ఆడదాని సక్సెస్‌ వెనకాల కూడా మరొక ఆడదేగా ఉండేది!

ఒక నెల రోజుల తరువాత అత్త నుండి నాన్నకి నా మీద కంప్లైన్‌ట్ వెళ్ళింది. “ఇంకెన్నాళ్ళు ఇలా భరిస్తావు వచ్చి మా ఇంట్లో ఉండిపొ”అని చెప్పారుట నాన్న అత్తకి. కిమ్మన్నాస్తి. ఇన్నేళ్ళు నాన్నకి ఈ చిన్న మాట చెప్పే పెద్ద దిక్కే లేక పోయిందే అనిపించింది!

అదిగో చీకటి పడుతోంది. కాళ్ళు స్వాధీనంలోకి వచ్చాయి. ఇంక నాకోసం వంటిల్లు ఎదురు చూస్తోంది.

——******——

👉 ~~~~~~ 👉 Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(TP) 2. గొలుసు కుట్టు

ఆ.
జగమెరిగిన జాణ ఛాయా చిత్రము
మార్చి మార్చి జూప మరువ గలమె?
చేతివాటమెంత చేవగలిగినను
ఈశ్వరేచ్ఛ వరకె ఇంగితమ్ము!

ఆ.
పట్టుబడక తిరుగ పరువు బరువుగాదె?
తెలివితోడజూప తెగువ, ఇంటి
దొంగ చేయు పనులు దొరతనమందురె?
మేకవన్నె పులులు మెండు గాదె!

(TP) 1. ఇక్కడ మూడేళ్లు తదుపరి పాతికేళ్లు

ఇక్కడ చపాతీ తిన్నాము, ఉప్మా తిన్నాము, కిచిడి తిన్నాము, పులిహోర తిన్నాము
ఈ పాతికేళ్లలో చపాతి, కిచిడి, పులిహోర వగైరా అయ్యాము!

ఇక్కడ గడ్డం చేసుకోవడం నేర్చుకున్నాం
ఈ పాతికేళ్లలో అది పట్టుకోవడం నేర్చుకున్నాం!

ఇక్కడ ప్రతి మూలా ఏరా అనే పిలుపు
ఈ పాతికేళ్లలో దానికై వెతికాము ప్రతి మలుపు!

ఇక్కడ గట్టు మీద, చెట్టు కింద కూర్చుని ఆలోచించే వాళ్ళము
ఈ పాతికేళ్లలో పరిగెత్తి పాలు త్రాగడం వైపు మళ్ళాము!

ఇక్కడ ఏనాడైనా మెస్సులోంచి నీళ్లు రూంలోకి పట్టుకెళ్ళామా?
ఈ పాతికేళ్లలో ప్లాస్టిక్ బాటిలే మన రెండో పెళ్ళామా?

ఇక్కడ కృష్ణమ్మ నీరు, పాఠాలు జోరు, స్నేహితుల ప్యారు
ఈ పాతికేళ్లలో పన్నీరు, మున్నారు, రెండు పుస్తెల జీవితం క్యారు క్యారు!

ఇక్కడుండగా విన్నా ... డబ్బు ప్రాణమంటి మనుషుల మధ్య పగ పెడుతుందని
ఈ పాతికేళ్లలో కన్నా ... గాలి, నీరు, తిండితో కూడ పడనివ్వదని!

ఇక్కడ పొందాము పట్టాలు
ఈ పాతికేళ్లుగా మన బండి దిగలేదు పట్టాలు!

అయినా సరే, వెనక్కి తిరిగి చూస్తే
మూడేళ్ల మురిపం మిన్న
పాతికేళ్ల ప్రయాస కన్నా!

——******——

PS. APRDC, నాగార్జున సాగర్‌లో చదువుకున్న తరువాత సిల్వర్ జూబ్లీకి, 2018లో, కలవాలనుకున్నప్పుడు వచ్చిన జ్ఞాపకాలివి.

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 4. Catering Manager

In an Indian wedding party
Catering is charity.
Hosts spend, guests chill;
Hosts’ onus, guests’ thrill.

The venue and its location,
The facilities and decoration,
All glean to appeal,
If not, anything can repeal.

Hosts and guests hug,
Showing up the hype big and big;
Even on such an occasion,
Can we see ego submission?

Water, juice, coffee or tea
He would, in person, offer with a gentle glee;
All day, walk through to every corner,
Young or old, politely ask and handover.

Wearing kurta-dhoti, bald head and a smile,
Walk unambiguously like a relative of all.
Host, guest or servant, service is the rule,
This grand old man knows no beguile.

If we like simple, sincere,
Dedicated and spiritual air,
We have lessons to learn for mind and body,
We have lessons to learn for mind and body.
PS. I saw this old man at a family function in a big hall in DD Colony in Hyderabad, India, in 2009.

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 3. Road Rule, a Child’s Play?


Dear Parents,

Please teach your school-going child
How to cross the road,
And your college-going grown-up
Why to follow a road rule——

Look on either side near the Zebra-crossing
No zig zag fancy while driving;
Use horn, blinker, seat-belt and helmet
To not to remind the fellow commuters of kismet.
Let high-beam lights illuminate,
And not allow the brightness shower darkness.

Speeding leads to concern
Instead, look, think and discern.
All (e)documents are mandatory
And ignorance is predatory.
Commonsense should prevail
If not, it may not be a smooth sail.

The nursery rhyme still holds – “Stop says the red ...”
So that the onlookers realise, “he's well-bred!”

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 2. Lockdown Laurels

Lockdown(LD) has given us an easy way to understand a paradox
It’s like handing over someone a hard copy of the fax!
As the most sophisticated animal is invaded by the invisible
Man is shut; animals venture out; it’s visible!

Comparison makes relationship tentative
During LD, increase in divorce rate is representative;
Love and affection make relationship effective
During LD, increase in expected birth rate is indicative!

Peck and handshake have become contactless
As social distancing made them clueless
‘Touch me not’ is now an accepted discrimination
Masking oneself is the best identity and revelation!

Students greet teachers in the chat boxes
Virtual eye-contact is the greatest of jinxes
Entering the class is with an interest to exit
Log in to log out is very fair and fit!

Vehicles went off the roads; pollution too
Roads emptied to be filled again; pollution too
Birds chirped in the balconies; nature too
Man got in to get out; nature too!

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(EP) 1. You Are Known by Your Mask!

A panoramic view of the pandemic
As it grew, place to place, from epidemic
The infestation couldn’t be presaged
As the sage in man is caged.

The microscopic virus is so virulent
The macroscopic human misery is that opulent
Our earth has become a global village
Pertinent to give it the unfathomable mileage.

It’s variants have subtle regulation
The antidote lies in surmise and speculation
It leaves no room for a quick vaccination
While the attack goes on — nation after nation.

Where lies the root and where lies the fruit?
Which weapon can shoot and who’s that recruit?
Whom to reach and what’s the preach?
When is the D-day and how to fetch?

While the quest for the invisible is on
While we wait for the solution to be born
While the lockdown is prevention and not cure
While we all comprehend that life continues for sure ...

Let’s pool our wits, and sit and think
Social distancing is a definitive part to break the LINK
Let’s use our rationality and education in this task
For it’s a new norm, “You are known by your MASK 😷!”

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(Hindi) 2. उस रात के लिए …

बैठ बैठ कर अपने आप से करता हूं बात,
जस्बात ही तो है उसकी सुबूत।
सुकून बेच बेच के जीता हूं ये तन्हाई,
पल पल जानता है उसकी गेहराई।

मेरी है दो आंखें,
जैसी ये दुनिया देखें।
एक पूरब है एक पश्चिम,
भाग न पाऊं, रस्ता है मुजरिम।

खरीद लाया हूं कप तीन,
जब आयेंगे दोनों तरफ से मेरी जान,
बनाऊंगा चाय आधी रात में,
घरके ऊपर बैठके तीनों पियेंगे मज़े में।

अस्सी में हूं असली भी हूं,
आंखें खुली या बंद, उनकी राह देखता हूं।
आखिर बेटियों का बाप हूं सच बोलता हूं,
जभ्भी वो आते हैं तब ही त्योहार मनाता हूं।

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

(Hindi) 1. अंदाज़ अपना अपना!

जो बरसती नहीं वो बादल किस लिए?
जो अंकुरण नहीं हो सकती वो बीज किस लिए?
जो देख नहीं सकते वो खूबसूरती किस लिए?
जो सुन नहीं सकते वो ग़ज़ल किस लिए?
जो बैठ नहीं सकते वो मेहफिल किस लिए?
जो आजमा नहीं सकते वो जज़्बात किस लिए?
जो निभा नहीं सकते वो रिश्ते बनाना किस लिए?
जो दूर नहीं रह सकते वो जुदाई किस लिए?
जो पास नहीं रह सकते वो नज़दीकी किस लिए?
जो दिल भर नहीं दे सकते वो प्यार किस लिए?

अंदाज़ अपना अपना!

——******——

👇 ~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

3. ఆ మూడు పేజీల్లో …

తన స్నేహితుడితో చాలా సేపు ఫోన్లో మాట్లాడి వచ్చి పడక కుర్చీలో కూర్చున్నాడు చిదానందం. వాళ్ళ తాతల నాటి కుర్చీ. టేకు కలప తెప్పించి దగ్గరుండి చేయించానని చెప్పేది వాళ్ళ నాయనమ్మ. అందుకోసం, ఇంట్లో పెద్ద సోఫాసెట్టు ఉన్నా, ఆ పడక కుర్చీలో కాసేపు కూర్చోకపోతే అతనికి రోజు గడిచినట్టు ఉండదు. అందులో ఇలా కూర్చున్నాడో లేదో, అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చిక్కుడుకాయలకు ఈనెలు తీస్తున్న అతని భార్య, “అయిందా మీరు ఫోన్లో మాట్లాడడం? ఎవరితోనో అంత సుదీర్ఘమైన బాతాఖానీ? అదీ అలా బయటికెళ్ళి మరీనూ …” అంది కొంచెం గీరగా. తన కళ్ళజోళ్ళోంచి అలవాటు ప్రకారం అలా ఓ పక్కచూపు చూసి, చిదానందం, “ఓ … అదా? … మా డిగ్రీ క్లాస్మేట్. నెలకోసారి అలా మాట్లాడకపోతే ఏమిటో అదో వెలితి. ఆ ఐదుగురితోటీ నాకున్న అనుబంధం ఎలాంటిదో నీకు తెలుసుగదా! … ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేక అలా వాకిట్లోకి వెళ్ళి మావిడి చెట్టు కింద కుర్చీ వేసుక్కూర్చుని మాట్లాడాను” అన్నాడు. “ఏదో సరదాకి అన్నానండి. నాకు తెలియనిదా మీ అనుబంధం. సరేగానీ, వాళ్ళ అమ్మానాన్న, పిల్లలు అంతా కులాసాయేగదా?” అంది అతని భార్య. “ఆ … అందరూ క్షేమంగా ఉన్నారు. వచ్చే నెల వాళ్ళు ఇండియాకి వస్తారుట.” అన్నాడు చిదానందం. “సో, శ్రీవారు ఆ మిగతా నలుగురి చేతా కూడా సెలవు పెట్టించే కార్యక్రమంలో ఉంటారన్నమాట!” అంటూ ఆ వొలిచిన చిక్కుడుకాయ ముక్కలు తీసుకుని బెల్లం పెట్టి వండటానికి వంటింటిలోకి వెళ్ళింది అతని భార్య.

ఎందుకో చిదానందం భార్యకేసి అలా చూస్తూ ఉండిపోయాడు. భార్య అన్న ఆ మాటలు చిదానందాన్ని తను డిగ్రీ చదివే రోజులకి టైం మషీన్లో పడేసి తీసుకు వెళ్ళినట్టు తీసుకెళ్ళాయి. ఇంతలో అతని భార్య వచ్చి, “వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో కనుక్కోండి. ఓ కేజీ పండు మిరపకాయలు తెప్పించి కొరివికారం చేస్తాను. సూర్యం అన్నయ్యగారి నోట ‘జిహ్వ చచ్చింది’ అని వినాలని మీ కోరికగా” అంటూ తన భర్త కాలేజీ క్లాసురూములో ఉన్నారని గమనించకుండా చెప్పేసి మళ్ళీ వంటింటిలోకి వెళ్ళిపోయింది.

ఆరోజు మధ్యాహ్నం మొదటి క్లాసు. భారతీయ సంస్కృతి గురించి చెబుతున్నారు వాళ్ళ మాష్టారు. మొదటి రెండు మూడు వరుసల్లో కూర్చున్న చిదానందం, అతని స్నేహితులు కళ్ళు పెద్దవి చేసి, చెవులప్పగించి మధ్యాహ్నం భోజనం తరువాత వచ్చే నిద్ర కళలు కనిపించకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆవులింతలొస్తే అవి మాష్టారుకి కనబడకుండా చేతులు, జేబురుమాలు, పుస్తకాలు వాడడంలో వాళ్ళకి వాళ్ళే సాటి. అలాంటి విషయాలలో వాళ్ళందరికీ ఉన్న కోఆపరేషన్ మరియు కోఆర్డినేషన్ వర్ణనాతీతం. ఒకరిని మించిన వారు ఇంకొకరు. అవసరమైతే మాష్టారునే తికమక పెట్టేయగలరు. కుర్రకారు కదా!

మాష్టారు పాఠం మొదలుపెట్టిన కాసేపట్లో చిదానందం కుడి ప్రక్కన కూర్చున్న కుర్రాడు మోచేత్తో పొడిచి వెనక్కి చూడమని సైగ చేశాడు. ముందు మాష్టారుకేసి చూసి, ఆయన తనవైపు చూడటం లేదన్నప్పుడు అలా వెనక్కి ఓ లుక్కేశాడు. వెనకాతల కూర్చున్న సూర్యం, మిగతా క్లాస్మేట్స ముసిముసి నవ్వులు నవ్వు తున్నారు. విషయం ఏమిటో అర్థం కాలేదు. కానీ సూర్యం మాష్టారుకేసి చూస్తూ ఏదో వ్రాస్తున్నాడు. ఇంతలో మాష్టారు తెల్లవారి పాలనలో మన భారతీయ సంస్కృతి గురించి చెప్పడం మొదలు పెట్టారు. వారి పాలన మనలను ఎంతో చేతకానివారిని చేసిందని సూర్యం చాలా ఘాటుగా వాదించేవాడు. అంచేత, అతను టక్కున లేచి నిలబడి, “మాష్టారు, ఈ మధ్యనే మా తెలుగు మాష్టారు చిలకమర్తి లక్షీనరసంహం పంతులుగారు వ్రాసిన ఒక పద్యం చెప్పారు:

తే.
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి.

అని టకటకా ఆ పద్యం చెప్పి, “Sir, don’t you think the British rule spoiled our rich heritage and culture?” అని అడిగాడు. ఇంగ్లీషులో పాఠం చెబుతున్న ఆ సిటీబ్రెడ్ మాష్టారుకి అసలు తెలుగు పద్యమే అర్థం కాలేదు. ఆయన అతని దగ్గరకొచ్చి, ఆ పద్యం కాగితం మీద వ్రాయించుకుని దాన్ని తన జేబులో పెట్టుకుని, “Let me speak with one of our Telugu lecturers and get the essence of this poem. So, only then I can respond to your question. Okay … so, I was referring to …” అంటూ తన శైలిలో పాఠంలోకి వెళ్శపోయారు.

ఆయనతో మాట్లాడుతున్న ఆ కొద్ది క్షణాలు కూడా సూర్యం తన పుస్తకంలో ఏదో వ్రాస్తూనే ఉన్నాడు. అది చూసి పక్కనే కూర్చున్న వాళ్ళు వాళ్ళ నవ్వు ఆపుకోలేక పోతున్నారు. ఆ నవ్వులు కాస్త ఇబ్బందిగానే తోచినా, తనకు తెలుగు పెద్దగా రాదు గనక, మాష్టారు అదోలా నవ్వి ఊరుకున్నారు. వాళ్ళు నవ్వుతున్నది సూర్యం వేసిన ప్రశ్నకో లేక ఆయన తెలుగు భాషా జ్ఞానానికో కాదని ఆయనకి ఇంకా అర్థం కాలేదు.

ఆయనేమో సీరియస్ గా పాఠం చెప్పేస్తున్నారు. సూర్యం మూడు పేజీలు అటూ ఇటూ తిప్పేస్తూ ఏదో వ్రాస్తూనే ఉన్నాడు. క్లాస్ రూమ్ లో నవ్వటం ఎక్కువైపోయింది. అందులో ఇలాంటి విషయాలు నోట్లో అసలు నానవుగా. ఈ గందరగోళంలో అందరూ సూర్యం వైపే చూడటం మాష్టారు గమనించారు. అతని దగ్గరకి వెళ్ళారు. “So, Suryam, what’s the matter?” అన్నారు. అతను పేజీ తిప్పి వ్రాస్తూనే “Nothing, Sir” అన్నాడు. ఆయన ఒకసారి నవ్వుతున్న అందరికేసి చూసి, “ఏంటి సంగతి?” అన్నట్టు అతనికేసి చూశారు. సరైన సమాధానం రాకపోయేసరికి, ఆయన సూర్యం పుస్తకం తీసుకుని చూశారు. ఒక పేజీలో 1 నుండి 129 వరకు, ఇంకో దాంట్లో 1 నుండి 36 వరకు, మరొక దాంట్లో 1 నుండి 54 వరకు అంకెలు వేసి ఉన్నాయి. మాష్టారుకి అర్థంకాక, “What’s this?” అని అడిగారు. సూర్యం ఏమి మాట్లాడాలో అర్థంగాక అడ్డంగా తలకాయ ఊపాడు. ఇంతలో సూర్యం ప్రక్కనున్న ఆ క్లాసులీడరు, “Sir, please don’t take it seriously” అన్నాడు. “That’s fine. But, what’s this?” అని ఆయన మళ్ళీ అడిగారు. అప్పుడు అతను ‘ఇంక చెప్పేస్తున్నాను’ అన్నట్లు సూర్యంకేసి చూసి సైగచేసి, “Sir, in the last 35 minutes, you used the words ‘so’ 129 times, ‘as a consequence of which’ 36 times and ‘as a result of which’ 54 times.” అన్నాడు. క్లాసు మొత్తం ఒక్కసారి గొల్లుమని మనసార నవ్వేశారు. అందరితోపాటు మాష్టారు కూడా సరదాగా నవ్వేశారు.

ఆది గుర్తుకొచ్చి తనలోతానే నవ్వుకున్నాడు చిదానందం. ఆ పడక కుర్చీలో కూర్చుని ఇలాంటి జ్ఞాపకాలు నెమరేసుకోవడమంటే అతనికి భలే ఇష్టం! ఇంతలో, వంటింటిలోంచి ఘుమఘుమల కబురు రానేవచ్చింది.

——******——

👇~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

2. మహాభారతంలో మంచూరియా

చిదానందం తన భార్య, ఇద్దరు కొడుకులతో ఇండియాలో ఉన్న తన తల్లితండ్రులను చూడాలని అమెరికా నుండి వచ్చాడు. ఓ మూడు నాలుగు వారాలైనా ఉంటాడేమో! అతనికి తన తల్లితండ్రులంటే చాలా ఇష్టం. ఫ్లైట్లో పిల్లల గోల ఎలా ఉన్నా, వచ్చినప్పుడల్లా తన బాల్యాన్ని, ఇంట్లో అందరూ కలసి గడిపిన రోజులని వీలైనన్నిసార్లు గుర్తు చేసుకుని తనలోతానే నవ్వుకుంటూ ఏవో హావభావాలు వ్యక్తపరుస్తూ ఉంటాడు. తనకి అది తెలియని ఆనందం. ఎదుటివాళ్లకి మాత్రం అర్థం కాని వెర్రితనం. ఏది ఏమైనా … వాళ్ళు చేస్తే మంచి ఎదుటివాళ్ళలో చూస్తే పిచ్చి కదా!

వచ్చి నాలుగైదు రోజులైంది. పిల్లలు చిదానందం తండ్రిని గ్రాండ్పా అవి పిలవడం తగ్గించి, “థాతయ్య” అనే పదాన్ని అమెరికన్ ఇంగ్లీషు ఉచ్చారణతో పిలవడం మొదలైంది. గుడ్డిలోమెల్ల అని సరిబెట్టుకున్నారు ఈ రిటైర్డ్ తెలుగు మాష్టారు. అటు మనవళ్ళ మీద ప్రేమ, ఇటు తల్లిలాంటి తెలుగు భాష మీద ఉన్న ఇష్టం. రెంటికీ మధ్య నలిగిపోతున్నట్లనిపించినా, పెద్దరికం ముసుగులో దాన్ని దాచేసి ఎంచక్కా తన మనవళ్ళని నోరారా “ఏరా తాతయ్య” అని పిలుస్తూ ఆనందిస్తున్నారు ఆ తాతగారు. అయినా కానీ, మనవళ్ళకి ఎంతోకొంత తెలుగు నేర్పాలనే కుతూహలం మాత్రం ఆగమంటే ఆగుతుందా? డాక్టర్ ఎప్పుడైనా డాక్టరే; మాష్టారు ఎప్పుడైనా మష్టారే కదా!

అలా ఓక ఆదివారం సాయంత్రం ఒక తెలుగు ఛానల్లో అష్టావధానం మొదలయింది. తాతయ్య దాన్ని, గారెల్లో అన్నం పరవన్నంలా, కొత్తావకాయలో పెద్దరసంలా, గోంగూరపచ్చట్లో ఉల్లిపాయ ముక్కల్లా … రకరకాల రుచులు ఆస్వాదిస్తూ చూస్తున్నారు. ఇంతలో మనవళ్ళు అల్లరి చేస్తూ పరిగెత్తుకొచ్చారు. గబుక్కున చిన్నవాడు ఆయన మీదెక్కి కూర్చుని “థాతయ్య, సీ, హీజ్ బీటింగ్ మీ” అన్నాడు. తాతయ్య వాడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, “ఆ బడుధ్ధాయకి నేను లెంపలు వాయిస్తాలే గానీ, ఇప్పుడు చెప్పింది నాకు తెలుగులో చెప్పు” అన్నారు. వాడు, “థాతయ్య, ఛూడు, వాడు నాకి ఖొట్టింగ్ మీ” అన్నాడు. అది విన్న తాతయ్యకి పరవన్నంలో బెల్లం, ఆవకాయలో ఉప్పు, గోంగూర పచ్చట్లో ఇంగువ పోపు లేకుండా తిన్నట్టనిపించింది.

ఇలా అవధానం సాగుతోంది.

ఉత్సాహం ఆగని తాతయ్య, మనవళ్ళనిద్దరినీ పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆ అవధానంలో సమస్యాపూరణంలో ఇచ్చిన కంద పద్యపాదం చెప్పారు. “ద్రౌపది కురుపాండవులకు దౌత్యము సేసెన్” అని. శ్రీమదాంధ్రమహాభారతం అంటే చాలా ఇష్టం కనుక, తాతయ్య అప్పటికే రోజూ రాత్రి పూట తన మనవళ్ళని తన దగ్గర పడుకోబెట్టుకుని కొంత కథ చెప్పారు. కాబట్టి, వాళ్ళకి పాండవులు, కౌరవులు, వాళ్ళ మధ్య వైరము తెలిసాయి. ఆ ధైర్యంతో తాతయ్య ఈ పద్యపాదాన్ని వాళ్ళకి అర్థమయ్యే తెలుగులో చెప్పటం మొదలు పెట్టారు.

అది చెవిన బడిన నాయనమ్మ, అదేదో విందామని వంటింట్లోంచి అక్కడికొచ్చి నిలుచుంది. తాతయ్య, “ద్రౌపది … పాండవులకు, వాళ్ళ కజిన్స్, అంటే కౌరవులకు … దౌత్యము, అంటే సంధి చేసిందిట. అంటే …” అని చెప్పబోయేంతలో, పెద్ద మనవడు, “యా … థాతయ్య. ఐ గాటిట్. అంటే, ఇట్స్ లైక్ … వెజ్ మంఛూరియా ఛేసిందా, థాతయ్య?” అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక నోళ్ళెండబెట్టి చూస్తూన్న తాతయ్య నాయనమ్మల పరిస్థితి ఊహించి, ఇదంతా ప్రక్క గదిలోంచి వింటున్న చిదానందం “సిరికింజెప్పడు …” అన్నట్లు పరిగెత్తుకొచ్చాడు. తన భార్య వెనక్కాలే వస్తూ, ఏదో పరధ్యానంలో “బట్, ‘చిద్దూ’, ఆ రోజుల్లో కూడా ఇండియాలో …” అంటూ డిస్క్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. మరి అందరి ముందూ “ఏవండీ” అని పిలుస్తానని తనే మరచిపోయినట్లుంది. తాతయ్య, నాయనమ్మ, చిదానందం, ఆ తల్లీకొడుకులకేసి నోళ్ళెండబెట్టి చూస్తూ ఉండిపోయారు!

——******——

👇~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

1. ఆవ ఘాటు

చిదానందం: ఏమోయ్, ఆవపెట్టి పులిహోర కలుపుతున్నావా? … నిన్న, కందిపప్పు వేయించి వండిన ముద్ద పప్పు, కొబ్బరి తురిమి పెట్టిన మజ్జిగ పులుసు సూపరనుకో!

భార్య: ఔనా? మరి పప్పులోకి కొత్తావకాయ, అందులోకి మీగడ గిలక్కొట్టి తీసిన ఫ్రెష్ వెన్న కాంబినేషనో?

చిదానందం: అది ఇంకా సూపరు! అందుకేగా ఒక ముద్ద ఎక్కువ లాగించింది. అయినా నీ చేత్తో పెట్టిన ఆవకాయ ఏడాది పొడుగూ కొత్తావకాయలాగే ఉంటుందంటే నమ్ము. అందులోకి నువ్వు వేసే మీగడైతేనేమి, అది గిలక్కొట్టన వెన్నయితేనేమి, అలా నోట్లో కరిగిపోతుందనుకో.

భార్య: మరి మొన్న రోట్లో చేసిన పచ్చి ఉల్లిపాయ కారం?

చిదానందం: రోట్లో చేసిందా? అందులో చేస్తే ఆ రుచే వేరు. ఉల్లిపాయ ముక్కలు నలిగినలగకుండా కచ్చాపచ్చాగా, అన్నంలో కలుపుకుంటే తెలీకుండా మూడు సార్లు అదే అవుతుంది.

భార్య: నిజమేనండోయ్. మరి విసిరిన కందిపొడి, కాచిన నెయ్యి ఎలా ఉన్నాయంటారు?

చిదానందం: మరీ ఊరించేస్తున్నావోయ్. కాచిన నెయ్యికి వంకలేముంటాయ్ డియర్? కమ్మదనానికి అదే పెట్టిందిపేరైతేనూ!

భార్య: అంటే మొన్న పండక్కి చేసిన గారెలు, బొబ్బట్లు …

చిదానందం: నువ్వు చేస్తే వంకేంటోయ్? గారెల్లోకి అల్లప్పచ్చడి, అన్నం పరవన్నం. వేడివేడి బొబ్బట్లు. దేనికదే రుచి. ఈ అదృష్టం ఎందరికి పడుతుందంటావ్?

భార్య: ఔనండోయ్ … మరి ఆ అదృష్టం కాస్త నాక్కూడా అంటుకుంటే ఎలావుంటుందంటారు?

చిదానందం: భేషుగ్గా ఉంటుంది. అయినా నీ పిచ్చి గానీ నీ చేతి రుచులు నీకు నచ్చక పోవడమేంటి?

భార్య: అబ్బా నా ఉద్దేశం అది కాదు. ఇది వరకటిలా కాకుండా మీ జీతం బ్యాంకులో పడుతోందా? అలాగే, కరెంటు బిల్లు, ఫోను బిల్లు, గ్యాసు బిల్లు అన్నీ ఆన్లైన్లో ఇంట్లోంచే సులువుగా కడుతున్నారా? ఇంట్లో కూర్చుంటే సమస్తం గుమ్మంలోకొచ్చి పడుతున్నాయా? అలాగే నా పని కూడా కాస్త సులభం చేసుకుందామని …

చిదానందం: దాందేముందోయ్? తప్పకుండా. నీకేంకావాలో చెప్పు. కుదిరితే కాదంటానా?

భార్య: అదేనండి … బట్టలకి, గిన్నెలకి, గదులు తుడవడానికి పనమ్మాయిని పెట్టుకున్నా, రోజూ మూడుపూటలు వండి వార్చడం నా వల్ల కూడా అవట్లేదు. మన పక్కవాళ్ళు, అదే మీ బళ్ళో అకౌంట్సు క్లార్కు వాళ్ళకి, మూడుపూటలకి సరిపడ ఒకేసారి వండేసి వెళిపోతుందండి వంటావిడ.

చిదానందం: ఔనా?

భార్య: ఔనండీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెచ్చబెట్టుకుని ఎంచక్కా తినేయచ్చు. ఏవంటారు?

చిదానందం: తప్పకుండానోయ్. ఆ నాలుగు పనులూ చేసేవాళ్ళతో ఇంకో పనివాణ్ణి కూడా పెట్టుకోవాలి.

భార్య: ఎవరిని?

చిదానందం: మనందరిని పోషించేవాడిని.

ఇంక పులిహోరలో ఆవఘాటు నషాళాన్నంటేస్తుందేమో!

——******——

👇~~~~~~👇

Note: Please scroll down and leave a comment/ your impression in the box given below if you wish so.

Design a site like this with WordPress.com
Get started