ఒక పక్షి గూడు కట్టి, గుడ్లు పెట్టి,
వాటిని పొదిగి, తిరిగి తిరిగి
తెచ్చిన తిండి ఆప్యాయముగా
తన పిల్లల నోట జాగరూకతతో వేయును;
పిల్లల ఆకలి తీరు వరకు అలసటకోర్చి చేయును,
వాటికి రెక్కలొచ్చి ఎగురు వరకు.
ఇది ప్రకృతి సిద్ధము.
ఒక భుజంగము కట్టియున్న పుట్టలో చేరును.
గుడ్లు పెట్టి, వాటిని పొదిగి,
సాకుటకై జూచును. కానీ,
తన ఆకలికి పెద్ద పీట వేసి,
తానే భుజించును.
ఇది ప్రకృతి వైపరీత్యము.
కానీ, ఇవి రెండూ ఒకే గర్భమున
జనియింపకుండ జూచు దైవము
మనిషినేల కనికరింపడు?